నటనపై ఆసక్తితో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే విలక్షణమైన పాత్రలలో నటించి తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు. అలాంటి నటులలో తనికెళ్ల భరణి కూడా ఒకరు. టాలీవుడ్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనికెళ్లభరణి మంచి నటుడుగా గుర్తింపు సాధించారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. హాస్యం, ఎమోషనల్, విలనిజం ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు.
Advertisement
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనికెళ్లభరణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను విలన్ గా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లు తెలిపారు. 1973లో విడుదలైన మాతృదేవోభవ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. సినిమా ప్రసారం అవుతున్న రోజుల్లో సినిమా థియేటర్లలో కండ్లను తుడుచుకునేందుకు కర్చీఫ్ లు ఇచ్చారంటే ప్రేక్షకులను ఈ సినిమా ఎంత ఏడిపించిందో అర్థం చేసుకోవచ్చు.
నటనపై ఆసక్తితో ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే విలక్షణమైన పాత్రలలో నటించి తనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు.
Advertisement
ఇక ఈ సినిమాలో తనికెళ్ల భరణి విలన్ రోల్ చేశారు. సినిమాలో ముఖ్య పాత్రలో నటించిన నాజర్ ను తనికెళ్ల భరని హత్య చేసి పిల్లలకు తండ్రిని దూరం చేస్తాడు. మరోవైపు తల్లి క్యాన్సర్ బారిన పడి అనారోగ్యంతో ఉంటుంది. కాగా నాజర్ ను చంపే సన్నివేశం చూసి థియేటర్లో ప్రేక్షకులు జాలి పడకుండా తన వైపు సీరియస్ గా చూసేవారని తనికెళ్ల భరణి తెలిపారు. అంతేకాకుండా ఆమె అనే సినిమాలో తనికెళ్ల భరణి మరదలి పై కన్నేసి ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించే సన్నివేశాలుంటాయి.
ఈ సినిమాకు తన భార్య, మరదలితో కలిసి వెళ్ళినట్టు చెప్పారు. అయితే ఈ సినిమా చూసిన తరువాత తన మరదలు తన వంక అదోలా చూసింది అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మాతృదేవోభవ సినిమా తర్వాత ఓ ఊరికి షూటింగ్ కోసం వెళ్లగా అక్కడ వెదవ అంటూ తనను తిట్టారని చెప్పుకొచ్చారు. తను ఈ రెండు సినిమాలలో చేసిన పాత్రలు ప్రేక్షకుల్లో నాటుకుపోయాయని చెప్పడానికి అవే ఉదాహరణలని అన్నారు.
ALSO READ :
ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?
బీజేపీలోకి రండన్నా అంటూ అభిమాని రిక్వెస్ట్…బండ్ల గణేష్ షాకింగ్ రిప్లై..!