Home » ఆ పాకిస్థాన్ క్రికెట‌ర్ తో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..? ఫోటోలు వైరల్..!

ఆ పాకిస్థాన్ క్రికెట‌ర్ తో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..? ఫోటోలు వైరల్..!

by AJAY
Ad

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంటే టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. హ్యాపిడేస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా ఆ త‌ర‌వ‌త స్టార్ హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలో ఎదిగింది. రామ్ చ‌ర‌ణ్, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్, ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న హీరోయిన్ గా నటించింది. కొన్నేళ్ల పాటూ ఇండ‌స్ట్రీలో త‌మన్నా హ‌వా కొన‌సాగింది అన‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. ఇక ఇప్పుడు త‌మ‌న్నా సీనియ‌ర్ హీరోల‌తో సినిమాలు చేస్తూ అల‌రిస్తోంది. అంతే కాకుండా త‌మ్మూ ప్ర‌స్తుతం ఓటీటీ లోనూ సందడి చేస్తోంది.

Advertisement

అయితే తాజాగా త‌మ‌న్న పై కొన్ని ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మ‌న్నా పాకిస్థాన్ క్రికెట‌ర్ తో ప్రేమ‌లో ఉందంటూ సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. పాకిస్థాన్ క్రికెటర్ అబ్ద‌ల్ ర‌జాక్ తో త‌మ‌న్నా దిగిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతోనే ఈ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇటీవ‌ల అబ్దుల్ ర‌జాక్ తో క‌లిసి మిల్కీ బ్యూటీ దుబాయ్ లో జ్యువ‌ల‌రీ షాపుకు వెళ్లింది. అక్క‌డ ఇద్ద‌రూ క‌లిసి షాపింగ్ చేస్తున్న ఫోటోలు కాస్తా బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఇక అప్ప‌టి నుండి త‌మ‌న్నా అబ్దుల్ ర‌జాక్ ప్రేమ‌లో ఉన్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి.

Advertisement

tamannah abdul rajak

tamannah abdul rajak

అంతే కాకుండా త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తులు వినిపిస్తున్నాయి. అయితే ఇప్ప‌టికే ఈ వార్త‌ల‌పై స్పందించిన త‌మ‌న్నా మాత్రం అవ‌న్నీ పుకార్లే నంటూ కొట్టిపారేసింది. కానీ ఇద్ద‌రూ క‌లిసి దిగిన ఫోటోలు మాత్రం నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా త‌మన్నా చివ‌ర‌గా విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక ప్ర‌స్తుతం దీనికి సీక్వెల్ గా వ‌స్తున్న ఎఫ్ -3 లో కూడా త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది.

Visitors Are Also Reading