68వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం ఇవాల అట్టహాసంగా జరిగింది. అయితే ఈ అవార్డుల వేడుకలో తెలుగు సినిమాలు తమ సత్తాను చాటాయి. తెలుగు వారికి నాలుగు అవార్డులు లభించాయి. ఈ అవార్డులు 2020 సంవత్సరానికి ప్రకటించారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ ఫోటో ఎన్నిక అయింది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నీలం, బెన్ని ముప్పనేని నిర్మించిన కలర్ ఫోటో చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించింది. సంధ్యారాజు నటించి, నిర్మించిన నాట్యం సమకూర్చిన నాట్యం చిత్రానికి రెండు అవార్డులు వరించాయి. ఒకటి బెస్ట్ కొరియోగ్రఫికీ సంధ్యారాజు ఎంపిక కాగా.. అదే చిత్రం ద్వారా టీ.వీ. రాంబాబు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. అదేవిధంగా అల వైకుంటపురం సినిమాకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులు దక్కాయి.
Advertisement
Advertisement
ప్రధానంగా అలవైకుంఠపురంలో సినిమా గురించే అందరూ ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అనుకున్నట్టే అయింది. జాతీయ స్థాయిలో థమన్ పేరు మరొకసారి మారు మ్రోగిపోతుంది. అల వైకుంటపురంలో సినిమా మ్యూజిక్ ఏకంగా జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అనే ట్యాగ్ థమన్‌కు వచ్చేసింది. ఈ టాక్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అలా వైకుంటపురంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక నేషనల్ వైడ్ బజ్ చేసింది. ఇక థమన్ ఇచ్చిన సాంగ్స్ అయితే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో బజ్ చేసాయి. ఇన్ స్టా రీల్స్ రూపంలో ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాయి. దీంతో అందరూ అనుకున్నవిదంగానే సంగీత దర్శకుడు థమన్ కి జాతీయ అవార్డు అందుకున్నాడు.
Also Read :
విమానంలో ప్రయాణించే వారికి గుడ్‌న్యూస్.. ఇక ఆ రుసుము చెల్లించాల్సిన అవసరమే లేదు..!
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డ్యాన్స్ మీరు చూశారా..? సోషల్ మీడియాలో వైరల్..!