టాలీవుడ్ సంగీత దర్శకుడు థమన్ పేరు ప్రత్యేకం పరిచయం చేయడం అసలు అవసరమే లేదు. అతను తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అతని మ్యూజిక్ అంత ఫేమస్ మరీ. తాజాగా ఆయన అఖండ చిత్రానికి సంగీతం అందించారు. ఆ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది. ఈ మ్యూజిక్ గురించి అలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో థమన్ తాజాగా స్పందించారు.
Advertisement
టాలీవుడ్‌లో అగ్రదర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా ఘన విజయం సాధించింది. కరోనా సమయంలో కూడా బాలయ్య కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. డిసెంబర్ 02న విడుదలైన అఖండ బాక్సాపీస్ వద్ద దండయాత్రను ముగించుకుని ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయింది. సంక్రాంతి తరువాత జనవరి 21న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానున్నది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. సినిమాలో థమన్ అందించిన మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. ఈ చిత్రంలో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మంచి పేరు తెచ్చుకున్నది. ఈ అఖండ సినిమా అమెరికా థియేటర్లలో సౌండ్ తగ్గించారట.
Advertisement
అంత భారీ సౌండ్‌తో సంగీతమందించారు కదా..? దానికి శిక్షణ ఏమైనా తీసుకున్నారా..? అని అలీ ప్రశ్నిస్తే అది అంతా హీరోగారి మీద ఉండే అభిమానమే అని చెప్పుకొచ్చారు. అందరూ సౌండ్ గురించి అడుగుతున్నారు అని చెప్పుకొచ్చారు. గుడిలో హారతి ఇచ్చే సమయంలో డ్రమ్స్, గంటలు మోగిస్తారు కదా. ఆ సౌండ్ తగ్గించమని అడుగుతామా..? ఆ సినిమాలో బోయపాటి బాలకృష్ణ ను అలా చూపించారు. అఖండ ఇంటర్వెల్ సీన్‌కు ఆర్ఆర్ చేయడానికి 32 రోజులు పట్టిందని వివరించారు. అఖండ సినిమా కోసం చాలా కష్టపడ్డాం అని, సినిమా చూస్తే మీకు చెవులు నొప్పి పెట్టవు. కేవలం మీలోకి దేవుడు ఆవహిస్తారని చెప్పారు థమన్.
ముఖ్యంగా థమన్ ఎక్కువగా కాపీ కొడతాడని కొందరూ చేసిన విమర్శలు విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏమిటని అడిగితే.. నా దర్శకులు, నిర్మాతలు, హీరోలు నన్ము నమ్మినప్పుడు విమర్శలు చేసే వాళ్ల గురించి నాకు ఎందుకు అని ప్రశ్నించారు. నేను ఎంత కష్టపడుతున్నానో దర్శకులు, హీరోలు, రచయితలు, గాయకులు చూస్తూనే ఉన్నారు. నేను ఒక్కటే ఆలోచిస్తా.. సినిమా అనేది అన్ని క్రాప్టులకు సంబందించినది. నా వెనుక 100 మంది కష్టపడితేనే అవుట్ పుట్ వస్తోందని చెప్పారు.
ఇక దేశవ్యాప్తంగా అఖండ చిత్రం కోసం 600 మంది మ్యూజిషియన్లు పని చేసారు. వారికి మంచి జీతాలు అందాయి. మ్యూజిక్ బిల్లు రూ.1.83 కోట్లు వచ్చిందని వెల్లడించారు. తాను ఒక లారీ డ్రైవర్‌ను అని నా పేరుతో వాళ్లకు డబ్బులు ఇస్తున్నాను. అందరం కలిసి పని చేశాం. పేరు మాత్రమే తనకు వస్తుందని చెప్పారు థమన్. విమర్శలను పట్టించుకోను. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలుసు అని వివరించారు.