Home » Baba vanga: 2023లో భయానక విపత్తు.. బాబా వంగ భవిష్యవాణి..!!

Baba vanga: 2023లో భయానక విపత్తు.. బాబా వంగ భవిష్యవాణి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలం నుంచి బాబా వంగ చెప్పే భవిష్య వాణి నిజమౌతూ వస్తోంది. అమెరికాలో ఉగ్రవాద దాడులు జరుగుతాయని డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం వంటివి ఇప్పటికే నిజమయ్యాయి. అయితే బాబా వంగ 2023లో జరిగే విషయాలను తెలియజేశారు. మరి ఆమె ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. 2023 సంవత్సరంలో సౌర తుఫాను వస్తుందని దీనివల్ల తీవ్రమైన పరిణామాలు వస్తాయని అంచనా వేసింది. ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చడం వల్ల సూర్యుడు ఉపరితలం నుంచి రాకాసి మంటలు ఎగిసి పడతాయని దీనివల్ల రేడియో సమాచార వ్యవస్థ దెబ్బతింటుందని , ఎలక్ట్రానిక్ పరికరాలు పని చేయవని అంచనా వేసింది వంగ బాబా..

Advertisement

also read;నాగబాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ చిరు చేయడం వెనుక నమ్మలేని నిజాలు..!!

అంతేకాదు 2023లో భూమి తన కక్షను మారుతుందని అంచనా వేసింది. స్పేస్ డాట్ కామ్ ప్రకారం భూమి సూర్యుడికి 58.4 కోట్ల మైళ్ళ దూరంలో తిరుగుతూ ఉంది. అయితే ఈ భూమి తిరిగే కక్షమార్గం గుండ్రంగా లేదు కోడుగుడ్డు ఆకారంలో ఉన్నది . ఈ తరుణంలో గ్రహాల ఆకర్షణ వల్ల భూమి కక్షమార్గం మారే అవకాశం ఉండవచ్చని దీనివల్ల వాతావరణ మార్పులు ఏర్పడి అతివేడి,అతి చలి ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది.అంతేకాదు 2023లో జీవ రసాయన ఆయుధాలపై పరీక్షలు జరిగే అవకాశం ఉందని వంగ బాబా అంచనా వేసింది. నిజానికి ఈ అంచనా చాలా భయంకరమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే భయానకమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు.

Advertisement

కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జీవ రసాయన ఆయుధాల్ని తయారు చేస్తే మాత్రం ప్రపంచం మొత్తానికి ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది.అయితే వంగ బాబా 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఓ తుఫాను వల్ల కంటి చూపు పోయింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆకాశం వైపు చూస్తూ భవిష్యత్తును అంచనా వేయగలిగింది. ఆమె ఐసిస్ ఉగ్రవాదులు వస్తారని చెప్పింది అది చెప్పినట్లే జరిగింది. అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఆఫ్రో అమెరికన్ అవుతారని చెప్పింది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయ్యారు. ఈ విధంగా వంగ బాబా 2023 లో జరిగే విపత్తుల గురించి వివరించింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read;మాతృదేవత మూవీ సూపర్ హిట్ అయినా అప్పుల పాలైన సావిత్రి..కారణం..?

Visitors Are Also Reading