ఈరోజు నుండి తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్ జరగబోతున్నాయి తెలంగాణలో ఇంటర్ బోర్డు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లనే చేసింది. ఈరోజు ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 15 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు సెక్షన్లలో జరుగుతున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగితే రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఈ ప్రాక్టికల్ పరీక్ష మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు, మొదటి దశ ఫిబ్రవరి 1 నుండి 5 వరకు ఫిబ్రవరి 6 నుండి 10 వరకు రెండుసార్లు.
Advertisement
Advertisement
మూడవ దశ ఫిబ్రవరి 11 నుండి 15 వరకు రెండుసార్లు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు చెప్పింది. ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ విద్యార్థులు 387893 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ లోని గురుకుల కళాశాలలు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకి హాజరవుతున్నాయని చెప్పారు. అలానే ఎగ్జామినర్లు డబ్బులు ని డిమాండ్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు, ప్రాక్టికల్ ప్రశ్నాపత్రాలని అరగంట ముందే ఆన్లైన్లో ఉంచుతారని ఎగ్జామ్ మినర్ వచ్చి పాస్వర్డ్ ద్వారా ప్రశ్నాపత్రాన్ని డౌన్లోడ్ చేస్తారని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!