Home » Telangana:గురుకులాల్లో అగ్రికల్చర్ డిగ్రీ.. రేపే లాస్ట్ డేట్..!!

Telangana:గురుకులాల్లో అగ్రికల్చర్ డిగ్రీ.. రేపే లాస్ట్ డేట్..!!

by Sravanthi

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల డిగ్రీ కళాశాలలో బిఎస్సి అగ్రికల్చర్ చదవాలకునే విద్యార్థులకు ఒక చక్కని అవకాశాన్ని అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ కోసం ఇంకా ఒక్కరోజే గడువు మిగిలింది.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై చాలా రోజులు గడిచింది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.. మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమం కోసం గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఉన్న గురుకుల వ్యవసాయం మహిళ డిగ్రీ కళాశాలలో ఈ కోర్స్ అందుబాటులో ఉన్నది..

ఇది చదవాలనుకునేవారు బీఎస్సీ ( ఆనర్స్ ) అగ్రికల్చర్ కోర్సు నాలుగు సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. MJPTBCWREIS మహిళా వ్యవసాయ కళాశాల వనపర్తి లో 120 సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా MJPTBCWREIS కరీంనగర్ మహిళా వ్యవసాయ కళాశాలలో కూడా 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణకు చెందినటువంటి మహిళ విద్యార్థులు దీనికి అర్హులు..

విద్యార్హతలు :
ఇంటర్మీడియట్ లేదా డిప్లమా అగ్రికల్చర్ సీడ్ టెక్నాలజీ ఆర్గానిక్ అగ్రికల్చర్ పాసై ఉండాలి. ఇందులో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ప్రధానమైన సబ్జెక్టుగా ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ 2022 ఎంసెట్ లేదా MJPTBCWREIS అగ్రిసెట్ 2022లో అర్హత సాధించి ఉండాలి. వయస్సు 17 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్ విధానం:MJPTBCWREIS వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేదీ ఈ నెల అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. పూర్తి వివరాల కోసంhttps://   MJPTBCWREIS .comవెబ్ సైట్ ను సంప్రదించాలి.

also read:

Visitors Are Also Reading