తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో జరిగే భూమి రిజిస్ట్రేషన్లపై అదనంగా హరిత నిధిని వసూలు చేయనున్నారు. ప్రతి భూ రిజిస్ట్రేషన్ పై రూ.50లను వసూల్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement
హరిత నిధి రుసుమును స్టాంపుల రూపంలో వసూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది మార్చి 01వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని సీఎస్ తెలిపారు.
Advertisement
ప్రతి జిల్లాలో రిజిస్ట్రేషన్ సమయాల్లో హరిత నిధి రుసుంను తప్పకుండా వసూలు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచుతున్న విషయం తెలిసినదే. ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేయడానికి రిజిస్ట్రేషన్ల సమయంలో హరితనిధి రుసుమును వసూలు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
అతిగా ఆకలి వేస్తోందా.. అయితే ప్రమాదమే.. పరిష్కార మార్గాలు ఏంటో చూడండి..!
సైకిల్‌పై డెలివరీ చేసిన జొమాటో బాయ్.. 4 గంటల్లోనే బైక్ కొనిచ్చిన కస్టమర్..! ఎలాగో తెలుసా..?
మామిడిపండ్ల మధ్యలో చిలుక ఉంది.. ఎక్కడో గుర్తు పట్టారా..?