తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను తీసుకునే పనిలో ఉంది. తాజాగా వయోపరిమితి సడలింపుపై తెలంగాణ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుతం 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట అర్హత వయసును 44 ఏళ్లకు పెంచింది.
Advertisement
Advertisement
తాజాగా సడలించిన గరిష్ట వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంది. కాగా వయో పరిమితి సడలింపు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మినహా మిగతా ఉద్యోగాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం వయోపరిమితి ఓసీలకు 34 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లుగా ఉంది. అలాగే దివ్యాంగులకు 44 ఏళ్లుగా ఉంది. కాగా ఏ క్షణంలోనైనా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.