Home » అందుకే బొంబాయి హీరోయిన్ల‌ను తెచ్చుకుంటారు…!!

అందుకే బొంబాయి హీరోయిన్ల‌ను తెచ్చుకుంటారు…!!

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగులో సినిమాల్లో హీరోయిన్లు లేరా అంటే త‌ప్ప‌కుండా ఉన్నారు.  టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఉన్నారు.  అయిన‌ప్ప‌టికీ ఎందుకు తెలుగు సినిమాల్లోకి బొంబాయి నుంచి హీరోయిన్లు తెచ్చుకుంటారు అనే దానిపై ఓ న‌టి తేజస్వి మడివాడ  కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

తెలుగు సినిమాల్లో టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఉన్న‌ప్ప‌టికీ బొంబాయి నుంచి తెచ్చుకోవ‌డానికి కార‌ణం ఉంద‌ని, వారు ఫ్రీ అని అందుకు తెచ్చుకుంటార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.  ఈ విష‌యం అంద‌రికీ తెలుసు.  తెలుగు, త‌మిళ హీరోయిన్ల‌కు కూడా తెలుసు. ఇచ్చే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వారు ఉన్నారు.  ఆ కేట‌గిరిలో మ‌నం ఉన్నామా లేదా అన్న‌ది చూసుకోవాల‌ని అన్నారు.  అలా తీసుకొవ‌డం బొంబాయి నుంచి వ‌చ్చిన వారి నుంచే మొద‌లైంద‌ని, అంద‌రూ అలా చేస్తార‌ని కాద‌ని, ఇండ‌స్ట్రీలో 10 శాతం మంది మాత్ర‌మే ఉన్నార‌ని, వారి వ‌ల‌న మిగ‌తా 90 శాతం మందికి బ్యాడ్ వ‌స్తోంద‌ని అన్నారు.  వాటి వ‌ల‌నే ఇటీవ‌లే పెద్ద ఎత్తున గొడ‌వ‌లు, సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ర‌చ్చ జ‌రిగింద‌ని అన్నారు.  అలాంటి వారి వ‌ల‌న అందిరిని అలాగే చూస్తున్నార‌ని ఆమె తెలిపారు.

Advertisement

Visitors Are Also Reading