Home » IND VS WI : వన్డేలో టీమిండియా ఘన విజయం .. కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్

IND VS WI : వన్డేలో టీమిండియా ఘన విజయం .. కెప్టెన్సీతో ఆకట్టుకున్న రోహిత్

by Anji
Ad

అహ్మ‌దాబాద్ వేధిక‌గా జ‌రుగుతోన్న వ‌న్డే సిరీస్ తొలి మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అటు బౌలింగ్, ఇటు బ్యాంటింగ్‌లో స‌త్తా చాటి వెస్టిండిస్ పూర్తి ఆధిప‌త్యం చెలాయించి 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 177 ప‌రుగులు స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన టీమిండియా కేవ‌లం 28 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఘ‌న విజ‌యం సాధించింది. రోహిత్ శ‌ర్మ 60 ఇషాన్ కిషాన్ 28 ప‌రుగుల‌తో కీల‌క భాగ‌స్వామ్యం అందించ‌డంతో పాటు చివ‌ర్లో సూర్య‌కుమార్ 34, దీప‌క్ హుడా 26 ప‌రుగుల‌తో కీలక భాగ‌స్వామ్యం అందించ‌డంతో పాటు చివ‌ర‌లో సూర్య‌కుమార్ 34. దీప‌క్ హుడా 26 ప‌రుగుల‌తో కీల‌క భాగ‌స్వామ్యం అందించి విజ‌యాన్ని అందించారు. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది. విరాట్ 8, పంత్ 11 ప‌రుగులు చేశారు.

Advertisement

తొలుత బ్యాటింగ్ విండీస్ జ‌ట్టుపై భార‌త బౌల‌ర్లు విధ్వంసం సృష్టించారు. వెస్టిండిస్ జ‌ట్టు కేవ‌లం 176 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్, య‌జ్వేంద్ర చాహ‌ల్ వెస్టిండిస్‌కు ఎక్కువ న‌ష్టం క‌లిగించారు. య‌జేంద్ర చాహ‌ల్ 4 వికెట్లు తీసాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్లు తీశాడు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్ర‌సిద్ధ్ కృష్ణ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. 57 ప‌రుగుల‌తో అద్భుత ఇన్నింగ్ ఆడాడు జాన‌స్ హోల్డ‌ర్‌. వెస్టిండిస్ త‌రుపున అత్య‌ధిక స్కోర‌ర్‌గా హోల్ట‌ర్ నిలిచాడు . అదేవిధంగా ఫాబియ‌న్ అలెన్ కూడా 29 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి మ‌ధ్య అర్థ‌సెంచ‌రీ భాగ‌స్వామ్యం నెల‌కొన‌డంతో వెస్టిండిస్ జ‌ట్టు 176 ప‌రుగుల‌కు చేరుకోగ‌లిగింది.

Advertisement

తొలుత వెస్టిండీస్ వికెట్ కీప‌ర్ షాయ్ హోప్ బల‌మైన ఆరంభాన్ని అందించాడు. రెండు ఫోర్లు కొట్ట‌డం ద్వారా త‌న ఫామ్ లో ఉన్న‌ట్టు సంకేతాల‌ను చూపించాడు. అయితే మ‌రొక వైపు సిరాజ్ వేసిన బంతికి షే హోప్ బౌల్డ్ అవ్వ‌డంతో తొలి వికెట్ రుచి చూపించాడు. ఆ త‌రువాత బ్రాండ‌న్ కింగ్‌, డారెన్ బ్రావో గేమ్‌ను 11వ ఓవ‌ర్‌కు తీసుకెళ్లారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ రాక‌తో అంతా మారిపోయింది. 12వ ఓవ‌ర్‌లో సుంద‌ర్ మొద‌ట బ్రాండ‌న్ కింగ్‌ను ఔట్ చేసి.. ఆ త‌రువాత డారెన్ బ్రావోను ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేర్చాడు. రోహిత్ శ‌ర్మ, య‌జేంద్ర చాహ‌ల్‌ను రంగంలోకి దింపాడు. 20వ ఓవ‌ర్‌లో నికోల‌స్ పూర‌న్‌, కెప్టెన్ కీర‌న్ పోలార్డ్‌ల‌ను వ‌రుస‌గా రెండు బంతుల్లో అవుట్ చేయ‌డం ద్వారా వెస్టిండిస్ వెన్ను విరిచాడు. 20వ ఓవ‌ర్‌లోనే 5 వికెట్లు కోల్పోయింది. 22వ ఓవ‌ర్‌లో చాహ‌ల్ షెమ్రాన్ బ్రూక్స్ కూడా ఔట్ చేశాడు. మ‌రుస‌టి ఓవ‌ర్‌లో ప్ర‌సిద్ధ కృష్ణ త‌న బౌలింగ్ లో అకిల్ హుస్సెన్‌ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. విండీస్ టీమ్ 43.5 ఓవ‌ర్ల‌లో 176 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది.

Visitors Are Also Reading