Home » IND Vs ENG : ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం.. ఫస్ట్ ప్లేస్ కి చేరుకునే ఛాన్స్..!

IND Vs ENG : ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం.. ఫస్ట్ ప్లేస్ కి చేరుకునే ఛాన్స్..!

by Anji
Ad

భారత్-ఇంగ్లండ్  జట్ల మధ్య ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ గెలుపు తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌  పాయింట్ల టేబుల్‌ని ఐసీసీ అప్‌డేట్ చేసింది. గత మ్యాచ్‌ ఓటమితో ఐదు స్థానానికి పడిపోయిన భారత్‌..  ఇప్పుడు పుంజుకుంది. భారత జట్టు 52.77 శాతం స్కోర్‌తో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు 55 శాతం స్కోర్‌తో అగ్రస్థానంలో ఉంది. మూడో మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకునే అవకాశముంది.

Advertisement

ఇంగ్లండ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు ఏడు మ్యాచ్‌ల్లో 59 పాయింట్లు ఉంటాయి. అంటే 55 శాతం పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండోస్థానానికి చేరుకుంటుంది. అటు ఇంగ్లండ్  విషయానికి వస్తే.. ఈ ఓటమితో ఇంగ్లీష్‌ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ గెలవని ఏకైక జట్టు ఇంగ్లండ్‌ కంటే తక్కువ ర్యాంక్‌లో ఉంది  శ్రీలంక.  5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బాజ్‌బాల్‌పై భారత బౌలర్లు సత్తా చాటారు.

Advertisement

ప్రధానంగా బుమ్ బుమ్ బుమ్రా రెండు ఇన్సింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీశాడు. అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు. అశ్విన్ మరో వికెట్ తీస్తే.. 500 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు. రాజ్ కోట్ లో అదిసాధ్యమయ్యే అవకాశముంది.  మొత్తానికి  బాజ్‌బాల్ అనేది ఇంగ్లండ్ దూకుడు బ్యాటింగ్ శైలిని సూచిస్తుంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading