ఈ సంవత్సరం టీమిండియా బిజి బీజీగా మ్యాచ్‌లను ఆడనుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండిస్‌తో మ్యాచ్‌లు ఆడిన భారత్ ఫిబ్రవరి 24 నుంచి శ్రీలంకతో తలపడనుంది. అనంతరం ఐపీఎల్ వంటి మెగాటోర్ని ప్రారంభమవుతుంది. ఐపీఎల్ ముగిసిన తరువాత టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి ఉండదు. ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు టీ-20 మ్యాచ్‌లను టీమిండియా ఆడనున్నది. ఈ సిరీస్ తరువాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నది.
Advertisement
Advertisement
గత ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో అర్థాంతరంగా రద్దు అయిన టెస్ట్‌ను టీమిండియా ఈ సారి ఆడనున్నది. అదే సమయంలో ఐర్లాండ్‌తో ఒక టీ-20 మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ-20 ల సిరీస్ జరుగుతుంది. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తరువాత వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు టీమిండియా వెళ్లనుంది. అనంతరం యూఏఈలో జరిగే ఆసియాకప్‌లో భారత్ పాల్గొంటుంది. కాగా టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా రెండు బృందాలను తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. గత ఏడాది కూడా టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో మరొక టీమ్‌ను ధావన్ నేతృత్వంలో శ్రీలంక పర్యటనకు పంపిన విషయం తెలిసినదే.
Also Read : తమిళనాడు స్థానిక ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ హవా….!