Home » నారా లోకేష్ మెడకు ఫైబర్ నెట్ స్కాం… నారా బ్రాహ్మణినికి టిడిపి బాధ్యతలు ?

నారా లోకేష్ మెడకు ఫైబర్ నెట్ స్కాం… నారా బ్రాహ్మణినికి టిడిపి బాధ్యతలు ?

by Bunty
Published: Last Updated on
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత పది రోజుల కిందట అరెస్టు అయిన సంగతి తెలిసిందే. పది రోజుల నుంచి రాజమండ్రి జైల్లో ఖైదీ జీవితాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని… ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబు పేరును ఏపీ సిఐడి పోలీసులు చేర్చారు. అందులో భాగంగానే అరెస్టు చేసి… కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

nara-bramhini-and-nara-lokesh

nara-bramhini-and-nara-lokesh

 

ఇక ఇప్పుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా జైలుకు పంపిస్తారని సమాచారం అందుతోంది. తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై మరో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఫైబర్‌ నెట్‌ కేసులో పీటీ వారెంట్‌ చేసిన సీఐడీ.. టెరాసాఫ్ట్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్‌ నెట్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చారని ఆరోపణలు చేసింది. ఇప్పటికే ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ వ్యవహారంలో చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ వేసినా ఏపీ సిఐడి పోలీసులు ఇప్పుడు… ఫైబర్ నెట్ కేసును కూడా తెరపైకి తీసుకువచ్చారు.

Advertisement

Advertisement

టిడిపి ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని 2021 సంవత్సరంలోనే వైసిపి సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించింది. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయి అన్నది ప్రధాన అభియోగం. తెరాసాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ లెక్కన నారా లోకేష్ మెడ చుట్టూ ఈ ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ చుట్టుకొనుంది. ఈ కేసులో భాగంగానే నారా లోకేష్ ను అరెస్టు చేయాలని పోలీసులు స్కెచ్ వేశారట.

 

ఒకవేళ నారా లోకేష్ జైలుకు వెళ్తే తెలుగుదేశం పార్టీ బాధ్యతలను నారా బ్రాహ్మణికి అప్పగించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తుండట. బాలకృష్ణకు ఇవ్వకుండా తన కుటుంబ సభ్యురాలు అయిన నారా బ్రాహ్మినికి ఇస్తే బాగుంటుందని ఇప్పటికే చంద్రబాబు మూలాఖత్ లో పేర్కొన్నారట. ఇందులో భాగంగానే మరో వారం రోజుల్లో నారా బ్రాహ్మీనికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారట. అలాగే ఒక మహిళ పార్టీ బాధ్యతలు తీసుకొని… ఏపీ ప్రజల్లోకీ వెళితే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని కూడా తెలుగుదేశం ఆలోచన చేస్తుందట.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading