ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సినిమా వివాదం ముదిరింది. ఏపీ ప్రభుత్వానికి-టాలీవుడ్‌కు గ్యాప్ పెరిగింది. సినిమా టికెట్ల ధరలను పెంచడంతో పాటు ప్రభుత్వం టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల నిర్ణయాన్ని టాలీవుడ్ పెద్ద స్వాగతించారు. కానీ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించడం, అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సైతం వివాదంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
పేర్నినాని, ఆర్జీవీ లు సోషల్ మీడియాలో పలు ప్రశ్నలను సంధించుకుని సంచలనమే సృష్టించారు. అయితే తాజాగా మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు ఆర్జీవీ. ప్రభుత్వం వేసిన కమిటీసమావేశంమై ఈ అంశంపై చర్చలు కూడా జరిపింది. అన్ని రంగాల వైపు నుంచి అభిప్రాయాలను తీసుకుంది. నివేదికను ప్రభుత్వానికి త్వరలోనే అందజేయనున్నది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ వివాదంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు.
సినిమా టికెట్ల వివాదంలోకి తనను లాగేందుకు వైసీపీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. తాను సినిమా ఇండస్ట్రీకి సహకరించలేదు అన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో వ్యతిరేకంగా సినిమాలు చేసారని గుర్తు చేసారు. చిరంజీవి పెట్టకముందు.. తరువాత కూడా తనతో బాగానే ఉన్నారని గుర్తు చేశారు చంద్రబాబు. చిరంజీవి పార్టీ పెట్టకముందు తరువాత కూడా తనతో బాగానే ఉన్నారని, ఆయన పార్టీ పెట్టడం వల్ల తాను ఆ సమయంలో సీఎం కాలేకపోయాను అని వెల్లడించారు.
చిరంజీవి తాజాగా సినీపరిశ్రమనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు.. సినీ పరిశ్రమలో కూడా హాట్ టాపిక్‌గా మారాయి. రాజకీయ సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తూ ఉన్నాయి. ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై స్పందిస్తూ.. ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. అదేవిధంగా జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు సినిమా టికెట్ల గురించి మాట్లాడే సీఎం .. భవన నిర్మాణంపై మాట్లాడారు అని విమర్శించారు. సొంతంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఇష్టానుసారంగా ధరలను పెంచుకుంటున్నారు అని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జగన్ పీడితులే అన్నారు చంద్రబాబు. సంక్రాంతి శోభ లేక రాష్ట్రంలో కళ తప్పిందని వాపోయారు.