Home » అత‌నొక్క‌డే..భార్య‌లు ఎనిమిది మంది..!

అత‌నొక్క‌డే..భార్య‌లు ఎనిమిది మంది..!

by AJAY
Ad

ఒకప్పుడు ఇద్ద‌రు ముగ్గురిని పురుషులు వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా చేసుకుంటే చ‌ట్టాలు ఒప్పుకోవు. చ‌ట్టాల విష‌యం ప‌క్క‌న పెడితే అస‌లు ఒక్క‌రిని చేసుకుందామంటేనే అమ్మాయిలు దొర‌క్క చాలా మంది బ్యాచిల‌ర్ బాబులుగా మిగిలిపోతున్నారు. మ‌రో వైపు ప్ర‌స్తుతం ఉన్న ఖ‌ర్చులకు ఒక్క‌రితో నెట్టుకురావ‌డమే పెద్ద సాహసంలా పురుషులు భావిస్తున్నారు. కానీ ఇక్క‌డ ఒకే వ్య‌క్తి ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు.

tatoo artist ong dam sorot with wifes

tatoo artist ong dam sorot with wifes

అంతే కాకుండా అంద‌రితో క‌లిసి ఒకే ఇంటిలో కాపురం పెట్టాడు. ఇక ఒక్కో గ‌దిలో ఇద్ద‌రి చొప్పున ఏర్పాటు చేసి సంసారం చేస్తున్నాడు. ఆ ఉత్త‌మ‌పురుషుడు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం. థాయ్ లాండ్ కు చెందిన ఓంగ్ డామ్ సోర‌ట్ అనే ఫేమ‌స్ టాటూ ఆర్టిస్ట్ ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు. వీరంద‌రినీ ప్రేమ వివాహం చేసుకోవ‌డ‌మే కాకుండా అంద‌రినీ ఒప్పించి మ‌రీ ఈ పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Advertisement

tatoo artist ong dam sorot with wifes

రీసెంట్ గా ఓ ఫేమ‌స్ థాయ్ క‌మెడియ‌న్ ఎనిమిది భార్య‌ల వీరుడిని ఇంట‌ర్వ్యూ చేశాడు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో ఓంగ్ డామ్ సోర‌ట్ త‌న భార్య‌లతో ప్రేమ ఎలా జ‌రిగింది. పెళ్లిళ్లు ఎలా చేసుకున్నాడు. అంత‌మందిని పెళ్లికి ఎలా ఒప్పించాడు అనే విష‌యాల‌ను పంచుకున్నాడు. త‌న భార్య‌లు త‌న‌ను ఎంత‌గానో ప్రేమిస్తార‌ని చెప్పాడు.

tatoo artist ong dam sorot with wifes

అంతే కాకుండా మొద‌టి భార్య‌ను స్నేహితుడి పెళ్లిలో రెండో భార్యను మార్కెట్లో, మూడో భార్యను హాస్పిటల్ లో, 4,5,6 భార్యల‌ను ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, టిక్ టాక్ ఇలా సోషల్ మీడియా లో ఇక ఏడో భార్యను ఆలయం లో చూసి ప్రేమించి వివాహం చేసుకున్నానని చెప్పాడు. ఓ సారి నలుగురు భార్యలతో కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఎనిమిదో భార్యను ఇష్టపడి అక్కడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వచ్చినట్లు తెలిపాడు.

also read : కుక్క కాలు ఎత్తి మూత్రం పోయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading