నందమూరి తారకరత్న జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన ‘యువగళ’ అనే పాదయాత్రలో పాల్గొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే చిత్తూరు లోని హాస్పిటల్ కి తరలించి.. ఆతరువాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 23 రోజుల పాటు తారకరత్న చికిత్స తీసుకున్నారు. ఫిబ్రవరి 18న శివరాత్రి పండుగ రోజే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
Advertisement
తారకరత్న చనిపోయాడని వార్త తెలుసుకొని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాదయాత్రను తాత్కాలికంగా రద్దు చేసుకొని హైదరాబాద్ కి చేరుకున్నారు. తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. తారకరత్న మృతి బాధకరం అని పలువురు పేర్కొంటున్నారు.
Advertisement
మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య కూడా అస్వస్థతకు గురయ్యారు. రెండు మూడు రోజుల నుంచి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో ఆమె నీరసించిపోయారు. అలేఖ్యను ఆసుపత్రిలో చేర్చే ఆలోచనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. తన భర్త కోలుకుంటాడేమోనని ఎంతో ఆశతో దాదాపు 23 రోజుల పాటు వేచి చూసింది. తన భర్త తిరిగి మామూలు మినషి కావాలని వెయ్యి దేవుళ్లకి మొక్కింది. తారకరత్న తుది శ్వాస వదిలడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో అలేఖ్య మానసిక ఒత్తిడికి గురైంది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. దీంతో తీవ్రంగా నీరసించిపోయింది అలేఖ్య. ఆమెను ఆసుపత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించే యోచనలో ఉన్నారు వైద్యులు. మరోవైపు జనవరి20న మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరుగనున్నాయి.
Also Read : తారకరత్న లవ్ స్టోరీలో సినిమాకు మంచిన ట్విస్ట్ లు…మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారంటే..!