Home » వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!

వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!

by Bunty
Ad

ఏపీలో తెలుగు దేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టీడీపీ పార్టీని జనసేన భర్తీ చేసేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి టిడిపి కచ్చితంగా అధికారంలోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిపించుకోకపోతే ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందన్నది పార్టీ సామాజిక వర్గం బాధ ఆవేదన.

Advertisement

అందుకే ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు అని జూనియర్ ఎన్టీఆర్ అని టిడిపి వైపుగా లాగే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు పొలిటికల్ ఎంట్రీ పై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఈ నేపథ్యంలో నందమూరి తారకరత్న సంచలన ప్రకటన చేశాడు. ఏపీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని నందమూరి తారకరత్న అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య అధ్యక్షతన జరిగిన సభలో తారకరత్న ప్రసంగించారు.

Advertisement

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాను ఇప్పటినుంచి ప్రజల్లోకి వెళ్లి కృషి చేస్తానన్నారు. చంద్రబాబుకు వెంట ఉండి ప్రజల కోసం పోరాడుతానని చెప్పారు. సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తనకు వీలున్న సమయంలో ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు తాలుకాలను రద్దుచేసి మండల వ్యవస్థను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం గత మూడేళ్ల నుంచి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మాచర్లలో జరిగిన ఘర్షణలు ఇందుకు కారణమన్నారు. అటు ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కుట్రలతో పాలన చేస్తున్నారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి : వాల్తేరు వీరయ్య ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతికి చిరంజీవికి ఎలాంటి ఫలితం రానుంది?

Visitors Are Also Reading