Home » ఆ కారణంగానే తారకరత్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు : కోచ్

ఆ కారణంగానే తారకరత్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు : కోచ్

by Bunty
Ad

నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు. ఒక మసీదులో ప్రార్థనలో నిర్వహించి బయటకు వస్తుండగా, కొంత దూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను మెరుగైన

Advertisement

 

READ ALSO : 6 ఏళ్లు నిండితేనే 1వ తరగతిలో ప్రవేశం.. కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు

Advertisement

వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి 23 రోజులుగా ఆయనకు చికిత్స అందించినప్పటికీ కూడా శనివారం సాయంత్రం మహాశివరాత్రి రోజున తారకరత్న కన్నుమూశారు. ఇదిలా ఉండగా, తారకరత్న మరణం తర్వాత రోజుకొక వార్త వైరల్ గా మారుతుంది. తారకరత్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అని, అందుకే త్వరగా కోలుకోలేకపోయారు అంటూ తారకరత్న మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారకరత్నకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తారకరత్న కోచ్ పేరు విజయ శేఖర్. ఈయన దగ్గర తారకరత్న సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నారని సమాచారం. ఫోన్ ద్వారా తారకరత్నతో పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు. 2008వ సంవత్సర సమయంలో మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం జరిగింది అని విజయ శేఖర్ తెలిపారు. తారకరత్నకు క్రమశిక్షణ ఎక్కువ అని, టైమింగ్ ను ఆయన ఫాలో అయ్యే వారని విజయ్ శేఖర్ చెప్పుకొచ్చారు.

READ ALSO : Movie News in Telugu, Telugu News 

Visitors Are Also Reading