నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తారకరత్న మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయస్సులోనే తారకరత్న చనిపోవడం చాలా బాధాకరం.
Advertisement
దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు ప్రజలందరూ షాక్ కి గురయ్యారు.
తారకరత్న మరణించి రోజులు గడుస్తుండగా ఆయన గొప్పదనం గురించి ఎన్నో కొత్త విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే బాలయ్యను ముఖ్యమంత్రిగా చూడాలని తారకరత్న భావించారని సమాచారం. తారకరత్న జీవిత ఆశయం ఇదేనని, ఈ రీజన్ వల్లే టీడీపీ ప్రచారంలో తారకరత్న పాల్గొన్నారని సమాచారం. బాబాయ్ అంటే తారకరత్నకు ఎంతో ప్రేమ అని తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం సీఎం పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.
Advertisement
READ ALSO : టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?
బాలయ్య సీఎం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. టిడిపి 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని తారకరత్న కలలు కన్నారని సమాచారం. తారకరత్న జీవించి ఉంటే రాజకీయాల్లో తారకరత్న ఒకింత సంచలనాలు సృష్టించేవారు. అలేఖ్యరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొని రావాలని చంద్రబాబు భావిస్తున్నారని సమాచారం. చంద్రబాబు తలచుకుంటే అనుకున్నది కచ్చితంగా సాధిస్తారని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం