తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నెల రోజుల ముందు తమలో ఒకడిగా ఉన్నటువంటి తారకరత్న ఇప్పుడు తమ మధ్య లేడనే విషయాన్ని అతని కుటుంబ సభ్యులే కాదు.. ఫ్రెండ్స్, సెలబ్రెటీలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తారకరత్న భౌతిక కాయం దగ్గర అతని పిల్లలు ఉన్న విజువల్స్ చూస్తున్న ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. నాన్న తిరిగి రాడు అనే వాస్తవం వారికి చెప్పేది ఎలా ? అని కుటుంబ సభ్యులు తమలో తామే చాలా బాధపడుతున్నారు.
Advertisement
ఇలాంటి సమయంలోనే తారకరత్న పిల్లల గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా తారకరత్న దాదాపు 20 ఏళ్ల కిందట టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సినీ కెరీర్ ప్రారంభంలోనే ఒకటో రెండో హిట్స్ కొట్టిన మనోడు.. పెద్దగా సక్సెస్ అయితే చూడలేకపోయాడు. అమరావతి సినిమాలో విలన్ గా చేసి తనలో అసలు సిసలు నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసాడు. ఆ తరువాత కూడా పలు సినిమాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ.. వచ్చిన తారకరత్న ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు నటిస్తూ వచ్చాడు. కొద్ది నెలల ముందు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపించాడు తారకరత్న. ఇలాంటి ఆయన పాదయాత్రలో పాల్గొనడం, తొలిరోజే కుప్పకూలిపోయి ఆసుపత్రిలో చేరి దాదాపు 23 రోజుల పాటు చికిత్స పొందుతూ బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చనిపోయారు.
Advertisement
Also Read : చిరంజీవి పై ఫైర్ అయ్యిన రాజమౌళి…అప్పట్లో సంచలనంగా మారిన వార్త..!
తారకరత్న మరణించడంతో అతని భార్య అలేఖ్యరెడ్డితో పాటు ముగ్గురు పిల్లలు కూడా ఒంటరివాళ్లయ్యారు. దీంతో తారకరత్నకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో.. తాత ఎన్టీఆర్ అన్నా కూడా అంతకు మించిన ఇష్టం ఉంటుంది. అందుకే తారకరత్న తన పిల్లలకు ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చే విధంగా పేర్లు పెట్టారు. కూతురికి నిష్క అని, ఆ తరువాత పుట్టిన ట్విన్స్ లో అబ్బాయికి తనయ్ రామ్, అమ్మాయికి రేయా అని పేర్లు పెట్టుకున్నాడు. ఈ మూడు పేర్లు ఫస్ట్ అక్షరాలను గమనించినట్టయితే NTR అని వస్తుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు.. తారకరత్రకు తాత ఎన్టీఆర్ పై ఎంత ఇష్టం ఉందో అని గుర్తు చేసుకుంటున్నారు.