Tamim Iqbal : బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంగ్లాదేశ్ జట్టుకు ఎన్నో విజయాలను అందించి.. వన్డే కెప్టెన్సీ దక్కించుకున్నాడు తమీమ్ ఇక్బాల్. అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు రోజుల కిందట రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పాడు తమీమ్ ఇక్బాల్. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశాడు. అయితే.. తాజాగా తమీమ్ ఇక్బాల్ రిటైర్మెంట్ పై మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Advertisement
మొన్న రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని షేక్ హసీనా సూచన మేరకు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకున్నారు. కొద్దిసేపటి ప్రధానితో బేటీ అయిన అతడు…తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో రెండో వన్డేలో ఓటమి తర్వాత తమీమ్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
Advertisement
అయితే… ఒక్కరోజులోనే రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లా క్రికెటర్ తమిమ్ ఇక్బాల్ స్పందించారు. ‘గౌరవనీయులైన ప్రధానమంత్రి కి నో చెప్పలేను’ అంటూ ఇన్ స్టాలో రాసుకోచ్చారు. ఇక్బల్ నిన్న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకగా… మరో మూడు నెలల్లో వరల్డ్ కప్ ఉండటంతో ఆ దేశ ప్రధాని షేక్ హసినా సూచనతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అతడు మరో నెలపాటు విశ్రాంతి తీసుకుని ఆసియా కప్ నుంచి జట్టులోకి చేరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!
Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..