Home » కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు…అది ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే….!

కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు…అది ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే….!

by AJAY
Ad

తమిళనాడు కు చెందిన ఓ కుర్రాడు ఎంతో కష్టపడి ఐఏఎస్ సాధించాడు. ఆయన కథ ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకం గా మారింది. తమిళనాడు తంజావూరు జిల్లా మెలోట్టంకడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తండ్రి తాగుబోతు కావడంతో తల్లి కుటుంబ బాధ్యతలను మోస్తూ వచ్చింది.

Advertisement

చిన్నతనం నుండే ఎన్నో కష్టాలు అనుభవించిన ప్రభాకరన్ కు చదువుపై మాత్రం ఎంతో ఆసక్తి ఉండేది. దాంతో చిన్న వయసు నుండి కష్టపడి చదవాడు. కష్టపడి చదివి ఐఐటి మద్రాస్ లో సీటు సంపాదించాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ట్యూషన్ చెబుతూ… మొబైల్ షాప్ లో పనిచేస్తూ తన డబ్బును తానే సంపాదించుకున్నాడు.

Advertisement

అంతేకాకుండా తను సంపాదించిన దానిలో కొంత కుటుంబానికి కూడా సాయపడ్డాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యాడు. ప్రభాకరన్ తాను కన్న కలని నిజం చేసుకున్నాడు. ఇక ప్రభాకరన్ కలెక్టర్ ఉద్యోగం సాధించిన తర్వాత ఒక వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా పెళ్లికి ముందు ఆ డాక్టర్ ను ప్రభాకర్ కట్నం అడిగాడు.

దాంతో ఆమె షాక్ అయింది… అయితే ప్రభాకర్ అడిగిన కట్నం ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. పెళ్లి తర్వాత వారానికి రెండు రోజులు గ్రామాలలో ఉచితంగా పేదలకు వైద్య సాయం చేయాలని ప్రభాకర్ తన భార్యకు కండిషన్ పెట్టాడు. ఇక ప్రభాకర్ కండిషన్ కు ఆయన భార్య కూడా ఓకే చెప్పింది. ప్రస్తుతం వీరి స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా మారింది.

Also read : మీ అకౌంట్ లో డబ్బులు లేవా..? అయితే శుభవార్త మీ కోసమే..!

Visitors Are Also Reading