Home » మీ అకౌంట్ లో డబ్బులు లేవా..? అయితే శుభవార్త మీ కోసమే..!

మీ అకౌంట్ లో డబ్బులు లేవా..? అయితే శుభవార్త మీ కోసమే..!

by Anji
Ad

డబ్బులు అకౌంట్ లో లేవని చింతిస్తున్నారా.. అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం జన్ ధన్ అకౌంట్ ఉన్నవారికి ఈ సదుపాయం అందించింది. అకౌంట్ జీరో బ్యాలెన్స్ ఉన్న పదివేల వరకు డ్రా చేసుకోవచ్చు. దీనినే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. అయితే ఈ సదుపాయం అకౌంట్ హోల్డర్స్ అందరికీ మాత్రం ఉండదు. ఎక్కువ లావాదేవీలు జరిపే వారికి మాత్రమే ఉంది. జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు పదివేల వరకు డ్రా చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు బ్యాంకింగ్ సేవలను అందించాలనే ఉద్దేశంతో 2014లో ప్రధానమంత్రి జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు.

Advertisement

అసలు బ్యాంకింగ్ సేవల గురించి తెలియని వారికి.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, డబ్బులు దాచుకునే విధంగా ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఒక ప్రభుత్వం అందించే ఇతర పథకాల డబ్బులను కూడా ఈ పథకం ద్వారా అందిస్తుంది. జన్ దన్ అకౌంట్ సాధారణ సేవింగ్స్ అకౌంట్. బేసిక్ అకౌంట్ లో ఉండే ప్రయోజనాలన్నీ ఈ అకౌంట్ లో ఉంటాయి. ఎవరైనా ఈ జన ధన్ అకౌంటును ఓపెన్ చేసుకోవచ్చు. ఇతర అకౌంట్స్ ఓపెన్ చేస్తే అందులో మినిమం బాలన్స్ ఉండేలా చూడాలి. కానీ జన్ ధన్ అకౌంట్ కి మినిమం బాలన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేసినవారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డు లభిస్తుంది. 

Advertisement

Also Read :   రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !

ఇదే కార్డు పై రెండు లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్.., కవరేజ్ కాంప్లిమెంటరీ లభిస్తుంది. జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు పదివేల వరకు ఓపెన్ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందవచ్చు. అంటే అకౌంట్ లో డబ్బులు లేకపోయినా పదివేల వరకు డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక లోన్ లాంటిది. ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా ఎంత డ్రా చేస్తారో తిరిగి అంతే మొత్తంలో చెల్లించాలి. దాదాపు అన్ని బ్యాంకులలో అకౌంట్  ఓపెన్ చేసే అవకాశముంది. ప్రభుత్వ రంగ బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ బ్యాంకులో అకౌంట్ ని ఓపెన్ చేయవచ్చు. అప్లికేషన్ ఫామ్ ను పూర్తిచేసి సబ్ మిట్  చేసి కేవైసీ ప్రాసెస్ ను పూర్తి చేస్తే చాలు. 

Also Read :   రాజకీయాల్లో కృష్ణకు, జమునకు ఉన్న పోలిక తెలుసా ?

Visitors Are Also Reading