Home » పొన్నియన్ సెల్వన్‌ తో జక్కనను విమర్శిస్తున్న తమిళ మీడియా..!

పొన్నియన్ సెల్వన్‌ తో జక్కనను విమర్శిస్తున్న తమిళ మీడియా..!

by Azhar
Ad

ప్రస్తుతం మన దేశంలో పాన్ ఇండియా ట్రెండ్ అనేది నడుస్తుంది. ఏ భాషలో సినిమా అనేది తెరకెక్కిన దానిని మిగిలిన అన్ని భాషలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ అనేది ప్రారంభం కాకముందు ఇండియాలో నెంబర్ 1 సినిమా ఇండస్ట్రీగా బాలీవుడ్ ఉంటె ఆ తర్వాత తమిళ్ కు చెందిన కోలీవుడ్ ఉండేది. మన టాలీవుడ్ మూడో స్థానంలో ఉండేది.

Advertisement

కానీ ఇప్పుడు మన టాలీవుడ్ అనేది బాలీవుడ్ ను కూడా వెన్నకి నెట్టి మొదటి స్థానానికి వెళ్ళింది. కానీ ఇది బాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్ కు కూడా నచ్చలేదు. అయితే అక్కడి మీడియా మొత్తం ఎప్పుడు మన డైరెక్టర్లను.. ముఖ్యంగా బాహుబలి అనే సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ ను ప్రారంభించిన దర్శక ధీరుడు రాజమౌళి పైన విమర్శలు అనేవి చేస్తుంది.

Advertisement

తాజాగా తమిళ్ బాహుబలి అంటూ వచ్చిన పొన్నియన్ సెల్వన్‌ అనే సినిమా ప్లాప్ ఐన విషయం తెలిసిందే. ఎంత మంది సూపర్ స్టార్స్ ఉన్న ఈ సినిమా జనాలకు నచ్చలేదు. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ తమిళ్ మీడియా జక్కనను టార్గెట్ చేసింది. పొన్నియన్ సెల్వన్‌ సినిమా తెరకెక్కిన నవలలోని కొన్ని సన్నివేశాలను రాజమౌళి తన సినిమాలలో పెట్టుకున్నారు అని.. అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యాయని అని కామెంట్స్ చేస్తున్నాయి కోలీవుడ్ మీడియా. అయితే ఈ వార్తలను సోషల్ మీడియాలో భారీగా తిప్పి కొడుతున్నారు తెలుగు సినిమా ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

ధోనీ బయోపిక్ రావడానికి ఓ పిల్లోడు కారణమా..?

బుమ్రా ప్రపంచ కప్ ఆడటంపై దాదా రియాక్షన్..!

Visitors Are Also Reading