తమిళ స్టార్ హీరో అజిత్ కు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాధించాయి. ప్రస్తుతం అజిత్.. దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న వాలిమై సినిమాలో నటిస్తున్నాడు.టాలీవుడ్ యువ హీరో కార్తీకేయ ఈ చిత్రంల విలన్‌గా నటిస్తున్న విషయం విధితమే. ఈ సినిమాను ప్రకటిచనప్పటి నుంచి తమిళ అభిమానులు మాత్రమే కాదు ఇతర భాషల అజిత్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన వాలిమై ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేసారు వాలిమై నుంచి అజిత్ పోస్టర్‌ను అక్కినేని నాగచైతన్య విడుదల చేసారు.
Advertisement
అజిత్ మొదటి ఫ్యాన్ ఇండియా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న అజిత్ వాలిమై ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలవుతుంది. జీ స్టూడియోస్ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకం పై బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఏకంగా 20 మిలియన్ వ్యూస్‌తో రికార్డునే క్రియేట్ చేసింది.
Advertisement
తొలిత తమిళ వెర్షన్ మాత్రమే అనుకున్నాం అని, తెలుగు నాట సంక్రాంతి పండుగకు ప్రాముఖ్యత ఎలాంటిదో గుర్తించి తమిళంతో పాటు తెలుగు, హిందీలలో ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించినట్టు బోనీకపూర్ వెల్లడించారు. తెలుగులో విడుదలైన కార్తీ ఖాఖీ సినిమా దర్శకుడు హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్లతో తెరకెక్కించారు. అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. హీరో అజిత్‌కు బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంతో ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తీకేయ విలన్ పాత్ర కోసం తన శరీర దారుడ్యాన్ని మార్చుకున్నారు. జనవరి 13న సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరీ.