Home » బాలయ్య సినిమాలో తమన్నా.. ఏ క్యారెక్టర్ లో అంటే..?

బాలయ్య సినిమాలో తమన్నా.. ఏ క్యారెక్టర్ లో అంటే..?

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నారు. ఇక  వరుస సినిమాల్లో  అటు మాస్‌, క్లాస్‌ ప్రేక్షకులను ఆలరించి సూపర్‌ హిట్‌ గా నిలవడంలో ముందుంటున్నారు.   ఇక ఇదే  జోష్‌ లోనే బాలయ్య తన కొత్త సినిమా షూటింగ్‌ ని ప్రారంభించేశారు. ఈ చిత్రాన్ని వాల్తేరు వీరయ్య డైరెక్టర్‌ బాబీ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి ఎన్‌బీకే 109 అనే వర్కింగ్‌ టైటిల్‌ ని పెట్టారు. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌ కి తగినట్లు గానే ఈ సినిమా మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Advertisement

ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌ లో కనిపించనున్నారని టాక్‌. దీంతో ఈ విషయం గురించి తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు. అయితే బాబీ తీసే ప్రతి సినిమాలోనూ మాస్‌ ప్రేక్షకుల కోసం ఎప్పుడూ కూడా ఓ రేంజ్‌ లో మసాలా ట్రీట్‌ ఉంటుంది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ అయిన వాల్తేరు వీరయ్యలో మసాలా సాంగ్‌ తో ఏ రేంజ్‌ లో సందడి చేశాడో మనకు తెలిసిందే. ఆ ఊపుతోనే బాలయ్య సినిమా కోసం కూడా అదే రేంజ్‌ లో ఓ మసాలా ఐటమ్‌ సాంగ్‌ ను రూపొందిస్తున్నాడు. బాబీ ఇంతకు ముందు సినిమా అయిన జై లవకుశ లో తమన్నా తో స్వింగ్‌ జర అంటూ ఆడి పాడించాడు. అయితే ఇప్పుడు ఆ బ్యూటీని బాలయ్య కోసం ఎన్‌బీకే 109లో కూడా ఆడేందుకు ఒప్పించాడు.

బాలయ్యతో స్పెషల్ సాంగ్‌ చేసేందుకు తమన్నా కూడా జెండా ఊపిందని సమాచారం. ఈ ఎన్‌బీకే 109 సినిమాని సితార బ్యానర్‌ పై సూర్య దేవర నాగవంశీ, ఎస్‌ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్‌ లోనే ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాల్లో సస్పెన్స్ నడుస్తోంది.ఈ సినిమా హీరోయిన్‌ ఎవరనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోసారి సంక్రాంతికి బిగ్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చేందుకు బాలయ్య రెడీ అవుతున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే. 

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading