Home » భ‌ర్త చ‌నిపోతే న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లాడ‌వ‌చ్చు..తాలిబ‌న్ల కొత్త రూల్స్ ఇవే..!

భ‌ర్త చ‌నిపోతే న‌చ్చిన వ్య‌క్తిని పెళ్లాడ‌వ‌చ్చు..తాలిబ‌న్ల కొత్త రూల్స్ ఇవే..!

by AJAY
Ad

ఆఫ్గినిస్థాన్ ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్న త‌ర‌వాత కొద్ది రోజుల పాటూ వార్త‌లు మారుమోగిపోయాయి. కానీ ప్ర‌స్తుతం తాలిబ‌న్ల‌ను ఆఫ్గనిస్థాన్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. తాలిబ‌న్ల పాల‌న బాగుందో లేదంటే మీడియా పై ఆంక్ష‌లు ఉన్నాయోగానీ వారి అరాచ‌కాల‌కు సంబంధించిన వార్త‌లు అయితే క‌నిపించ‌డంలేదు. కానీ తాలిబ‌న్లు ఆఫ్నన్ ఆధీనంలోకి తీసుకున్న సమ‌యంలో జ‌రిగిన ర‌చ్చ మాత్రం అంతా ఇంతాకాదు. జ‌నాలు విమానాల వెంట‌ప‌రుగులు తీయ‌డం….విమానాల చ‌క్రాల‌కు వేలాడేందుకు ప్ర‌య‌త్నించి ప్రాణాలు కోల్పోవ‌డం…ఇక కొంద‌రు త‌మ బిడ్డ‌ల‌ను బార్డ‌ర్ దాటించేందుకు ప్ర‌యత్నాలు చేయ‌డం ఇలా చాలా జ‌రిగాయి.

AFGANISTHAN

AFGANISTHAN

అంతే కాదు తాలిబ‌న్లు ఆధీనంలోకి తీసుకునే ముందు ఊచ‌కోత‌లు కోసిన వీడియోలు సైతం నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇదిలా ఉంటే మొత్తానికి ప్ర‌పంచ దేశాలు ఆఫ్గ‌నిస్థాన్ ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక తాలిబ‌న్లు అధికారంలోకి వ‌స్తే ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తార‌ని…వారికి స్వేచ్ఛ ఉండ‌దని ఆరోప‌ణ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా తాలిబ‌న్లు పెళ్లిళ్ల‌పై కొన్ని రూల్స్ తీసుకువ‌చ్చారు. ఆ రూల్స్ మ‌హిళ‌ల‌కు కాస్త ఊర‌ట‌నిచ్చేవిగా క‌నిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

TALIBANS

TALIBANS

ఈ ఉత్త‌ర్వుల‌ను తాలిబ‌న్ల అధిప‌తి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో విడుద‌ల చేశారు. ఇక ఇందులో ఆఫ్గ‌న్ గిరిజ‌న తెగ‌ల్లోని వితంతువులు భ‌ర్త చ‌నిపోతే భ‌ర్త త‌మ్ముడిని లేదా అన్న‌ను పెళ్లి చేసుకోవాల‌నే నియమం ఉండేది. అయితే ఆచారాల‌ను మార్చేలా తాలిబ‌న్ల తాజా ఉత్త‌ర్వులు ఉన్నాయి. భ‌ర్త‌ను కోల్పోయిన మ‌హిళ 17 వారాల త‌ర్వాత త‌మ‌కు ఇష్ట‌మైన వారిని పెళ్లి చేసుకోవ‌చ్చు. మ‌హిళ‌ల బ‌ల‌వంత‌పు పెళ్లిళ్ల‌ను నిషేదిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. పురుషులు మ‌హిళ‌లు స‌మాన‌మ‌ని అతివ‌ను ఆస్తిగా ప‌రిగ‌నించ‌కూడ‌ద‌ని ఉత్వ‌ర్వుల్లో ప్ర‌క‌టించారు.

Also read : ఎమ్మెల్యే చనిపోతే.. కుమారుడి ప్రభుత్వం ఉద్యోగం..?

Visitors Are Also Reading