Home » ఎమ్మెల్యే చనిపోతే.. కుమారుడి ప్రభుత్వం ఉద్యోగం..?

ఎమ్మెల్యే చనిపోతే.. కుమారుడి ప్రభుత్వం ఉద్యోగం..?

by Bunty
Ad

ఒక ప్రజా ప్రతినిధి.. పదవిలో ఉండగానే మరణించిన సంఘటనలు మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. అలాగే… ఆ ప్రజా ప్రతినిధి చనిపోయిన తర్వాత.. అతని వారుసులకు టికెట్ ఇచ్చి.. మరీ గెలిపించుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోయిన సెంటీమెంట్‌ తో అతని వారుసులు.. గెలవడం కామన్‌. ఇలాంటి సంఘటనలు మన ఇండియాలోనే చాలా ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి.

Advertisement

Advertisement

అయితే.. ఎమ్మెల్యే చనిపోతే.. అతని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. ఈ అరుదైన సంఘటన… కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అవును.. కేరళ ముఖ్య మంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. కేరళ లోని.. చెంగనూరు ఎమ్మెల్యే అనారోగ్య కారణాల వల్ల మరణిస్తే.. కేరళ ప్రభుత్వం అతని కుమారునికి ప్రభుత్వం ఉద్యోగమే ఇచ్చేసింది. ఆయన కుటుంబంలో సంపాదనా పరులెవరూ లేరు. దీంతో సీఎం చదువు పూర్తి చేసుకున్న ఆయన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. జూనియర్‌ ఇంజినీర్‌ గా నియమిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.

అయితే.. వెంటనే దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అశోక్‌ కుమార్‌ అనే సామాజిక కార్యకర్త కోర్టు కేసు వేశాడు. అయితే.. ఈ నియామకం చెల్లదని కేరళ హై కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజల నుంచి ఎన్నుకున్న నాయకుడు కేవలం 5 ఏళ్లు మాత్రమే పదవిలో ఉంటాడని.. అలాంటిది.. ఎప్పుటికి ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడమేంటని ప్రశ్నించింది హై కోర్టు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కేరళ సర్కార్‌ ను హెచ్చరించింది.

 

Visitors Are Also Reading