Home » క‌రీనా ఇంటి ప‌నిమ‌నిషి జీతం ఎంతో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..?

క‌రీనా ఇంటి ప‌నిమ‌నిషి జీతం ఎంతో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..?

by AJAY
Ad

బాలీవుడ్ క‌పుల్ సైఫ్ అలీఖాన్ క‌రీనా క‌పూర్ ల ముద్దుల త‌న‌యుడు తైమూర్. బుడ్డోడే గానీ తైమూర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తైమూర్ అభిమానుల్లో ఎక్కువ‌గా అమ్మాయిలే ఉండ‌టం విశేషం. ముద్దొచ్చే చెంప‌లు ఉండ‌టంతో తైమూర్ ను అంద‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు. ఇక అప్ప‌ట్లో ఓ హీరోయిన్ తైమూర్ క్యూట్ నెస్ కు ఫిదా అయ్యి క‌రీనా ఒప్పుకుంటే ఫ్యూచ‌ర్ లో తైమూర్ ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్లు చేసింది. అయితే సాధార‌ణంగా సినిమా వాళ్ల లైఫ్ చాలా బిజీగా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

గ్యాప్ లేకుండా సినిమాలు ఉండ‌టం….వ‌రుస షూటింగ్ ల‌తో బిజీగా ఉండ‌టం వ‌ల్ల పిల్ల‌ల‌ను చూసుకునే టైమ్ ఉండ‌దు. దాంతో ఎక్కువ‌గా వారిని చూసుకోవ‌డానికి కేర్ టేక‌ర్ ల‌ను నియ‌మిస్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే తైమూర్ ఆలానా పాల‌నా చూసుకునేందుకు కూడా ఓ కేర్ టేక‌ర్ ఉన్నారు. ఆమె పేరు సావిత్రి…తైమూర్ ను ఎప్పుడూ ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు. తినింపిచ‌డం నీళ్లు తాగించ‌డం రోజూ వారి కార్య‌క్రమాలు ఇలా అన్నీ సావిత్రి ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. ఇక సావిత్రి కేర్ టేక‌ర్ గానే కాకుండా తైమూర్ కు ఓ బాడీగార్డ్ లా వ్య‌వ‌హ‌రిస్తుంటారు.

తైమూర్ వ‌ద్ద‌కు వ‌చ్చి ఫోటో లు దిగేందుకు ప్ర‌యత్నించినా ఆమె నిరాక‌రిస్తారు. ఇక తైమూర్ కు టైంపాస్ కోసం అత‌డితో క‌లిసి సావిత్రి కూడా ఆడుకుంటారు. తైమూర్ ను కంటికి రెప్ప‌లా చూసుకుంటున్న సావిత్రికి జీతం కూడా గ‌ట్టిగానే ఇస్తార‌ని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సావిత్రికి ప్ర‌తి నెలా అక్ష‌రాల ప‌దిహేను ల‌క్ష‌ల జీతాన్ని ఇస్తారని బాలీవుడ్ టాక్. ఇక సావిత్రి జీతం చూస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకంటే కూడా ఎక్కువే సంపాదిస్తుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సినవ‌స‌రం లేదు.

Visitors Are Also Reading