మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ఉప్పెన. ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ రావడానికి కృతి శెట్టి కూడా ఒక కారణం అనే చెప్పాలి. సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు పాటల్లో కృతి శెట్టి హావ భావాలు ప్రేక్షకుల మదిని దోచేశాయి. దాంతో సినిమా విడుదలకు ముందే కృతి శెట్టికి ఎంతో క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాలో బేబమ్మగా నటించిన కృతిశెట్టి తన డైలాగులతో కూడా ఆకట్టుకుంది. జ్వరం కావాలా అంటూ కుర్రాళ్లకు మత్తెక్కించింది.
Also Read: 2021 చివరలో విడుదలవుతున్న 5 చిత్రాలు ఇవే..!
Advertisement
Advertisement
అయితే ఈ అందమైన వాయిస్ బేబమ్మది కాదు. కృతి శెట్టికి డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్వేత వాయిస్ ను అందించింది. ఈ సినిమాకే కాకుండా కృతిశెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాకు కూడా శ్వేతనే వాయిస్ ను ఇచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక శ్వేత కేవలం కృతి శెట్టికి మాత్రమే కాకుండా కాజల్ అగర్వాల్ కు కూడా డబ్బింగ్ చెప్పారు. అంతే కాకుండా నివేధిత పేతురాజ్ కు కూడా శ్వేత డబ్బింగ్ చెప్పారు. నిజానికి సినీపరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్ లకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
హీరోలు హీరోయిన్ల కష్టం తెరపైన కనిపిస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ ల కష్టం తెరవెనక ఉంటుంది. ఇక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్ కూడా ఒకప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన వారే. ఆయన రజినీకాంత్ రాజశేఖర్ లాంటి హీరోలకు డబ్బింగ్ చెప్పారు. అంతే కాకుండా స్త్రీలలో చిన్మయి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు హీరోయిన్లకు ఆమె డబ్బింగ్ చెబుతున్నారు.
Also Read: నాకు వారి నుంచి ప్రాణహాని ఉంది : కరాటే కళ్యాణి