Home » 2021 చివ‌ర‌లో విడుద‌ల‌వుతున్న 5 చిత్రాలు ఇవే..!

2021 చివ‌ర‌లో విడుద‌ల‌వుతున్న 5 చిత్రాలు ఇవే..!

by AJAY

2021వ సంవత్సరం దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం మనం డిసెంబర్ నెలలో చివరి వారంలో ఉన్నాం.. ఇప్పటివరకు ఈ ఏడాది ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ లుగా నిలవగా మరి కొన్ని ఫ్లాపులుగా నిలిచాయి. కాగా ఈ ఏడాది చివర్లో కూడా కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

bollywood jersy

bollywood jersy

తెలుగులో నాని హీరోగా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. తెలుగులో దర్శకత్వం వహించిన గౌత‌మ్ తిన్న‌నూరినే హిందీలో కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 31న విడుదల కానుంది.

arjuna falguna trailer out

arjuna falguna trailer out

శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం అర్జున ఫల్గుణ. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అన్వేష్ రెడ్డి నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కూడా డిసెంబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది.

రానా హీరోగా నటించిన పిరియాడిక్ డ్రామా 1945. ఈ చిత్రాన్ని సి క‌ల్యాణ్ నిర్మించారు. స‌త్య‌శివ‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో రెజీనా హీరోయిన్ గా నటించగా నాజర్, స‌త్య‌దేవ్ కీలక పాత్రల‌లో నటించారు. ఈ సినిమాలో రానా స్వాతంత్య్ర‌ సమరయోధుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న విడుదల చేయనున్నారు.

తమిళ స్టార్ హీరో ఆర్య నటించిన సినిమా అంతపురం. తెలుగులోనూ ఆర్య‌కు కొంత మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదలకు సిద్ధంగా ఉంది.

asha encounter

asha encounter

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెర‌కెక్కించిన‌ సినిమా ఆశ ఎన్ కౌంటర్. ఈ సినిమాను నిజ సంఘటనల ఆధారంగా వర్మ తెరకెక్కించాడు. కోర్టుల చుట్టూ తిరిగిన ఈ సినిమా చివరకు జనవరి 1న విడుదల కానుంది.

Visitors Are Also Reading