Home » అబూదాబిలో నిర్మించిన స్వామి నారాయణ్‌ మందిరం.. ప్రధాని మోడీ తొలి పూజ..!

అబూదాబిలో నిర్మించిన స్వామి నారాయణ్‌ మందిరం.. ప్రధాని మోడీ తొలి పూజ..!

by Anji
Ad

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబూధాబిలో నిర్మించిన స్వామి నారాయణ్‌ మందిరాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.   అబూదాబిలో కన్నుల పండువగా స్వామినారాయణ్‌ ఆలయ ప్రారంభోత్సవం జరిగింది.  ఈ సందర్భంగా  భారత   ప్రధాని మోడీ అబూదాబి రాజుకు ధన్యవాదాలు తెలిపారు.  ఆలయంలో మోదీ తొలిపూజ చేశారు. తొలిహారతి కూడా ఇచ్చారు.

Advertisement

వేదాల్లో ప్రవచించిన విధంగా సామాజిక-ఆధ్యాత్మిక పరంపరకు అనుగుణంగా ఈ ఆలయాన్ని బొచాసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ వైష్ణవ ఆచారాలను పాటించే స్వామినారాయణ సంప్రదాయాన్ని ఆచరిస్తుంది. ఆలయమంతా కలియ తిరిగారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయట్రస్ట్‌ సిబ్బందిని అభినందించారు. ఈ ఆలయం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు మోడీ. ఈ ఆలయ నిర్మాణం కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎండా కాలంలోనూ నడిచేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనిలో నానో టైల్స్‌ ఉపయోగించారు.

Advertisement

స్వామినారాయణ్‌ వర్గ పదో ఆధ్యాత్మిక గురువు, BAPS అధికార ప్రతినిధి ప్రముఖ స్వామి మహారాజ్‌ ఏప్రిల్‌ 5, 1997న UAEలో మందిరం నిర్మించాలని సంకల్పించారు. దీని ద్వారా దేశాలు, సమాజాలు, సంస్కృతులను ఒక్క తాటిపైకి తేవాలని ఆయన భావించారు.  ఇంజినీరింగ్‌, నిర్మాణపరంగా ఈ ఆలయానికి ఎంతో విశేషాలు ఉన్నాయి. 108 అడుగుల ఎత్తులో నాగరశైలిలో నిర్మించిన ఈ ఆలయానికి ఏడు శిఖరాలున్నాయి. UAEలోని ఏడు ఎమిరేట్స్‌కు ఈ ఏడు శిఖరాలు ప్రతీక. ఆలయ ముందు భాగంలో సార్వజనీన విలువలు, వివిధ సంస్కృతుల్లోని సామరస్య గాథలు, హిందూ ఆధ్యాత్మిక నాయకులు, అవతారాల చిత్రాలు ఉన్నాయి.

Also Read : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

Visitors Are Also Reading