Home » SV Ranga Rao: భర్త, కొడుకు, కోడలు చనిపోయిన తరవాత ఎస్వీ రంగారావు భార్య ఎన్ని కష్టాలు పడ్డారంటే..?

SV Ranga Rao: భర్త, కొడుకు, కోడలు చనిపోయిన తరవాత ఎస్వీ రంగారావు భార్య ఎన్ని కష్టాలు పడ్డారంటే..?

by Sravya
Ad

SV Ranga Rao : ఎస్వీ రంగారావు గురించి అందరికీ తెలిసిందే. ఎస్వీ రంగారావు జీవితం గురించి ఆయన సినిమాలు గురించి అదే విధంగా వ్యసనాల గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఆయన చనిపోయిన విధానం కూడా మనకి తెలుసు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన జీవిత భాగస్వామి లీలావతి భర్తని కోల్పోయిన తర్వాత కొడుకు కోడల్ని కూడా కోల్పోయారు. ఒంటరిగా మనవడిని పెంచుతూ ఏ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు అనే విషయం బయట ప్రపంచానికి తెలియదు.

svrangarao

Advertisement

ఎస్ వి రంగారావు 1947లో లీలావతిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ముగ్గురు పిల్లలు అందులో ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రంగారావు బతికున్నన్ని రోజులు బానే సంపాదించారు పెద్ద ఆర్టిస్టులు కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని బాగా సంపాదించుకున్నారు.

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి 1974లో అయినా గుండెపోటుతో మరణించారు ఇక అప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఎస్వీ రంగారావు తన కొడుకుకి మాత్రమే పెళ్లి చేశారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితం ఎన్నో కష్టాలు తో నిండిపోయింది ఆయన వారసులు ఎవరూ నటనలోకి రాలేదు. ఏ ఉద్యోగం కూడా చేయలేదు. రంగారావుతోనే సంపాదన ఆగిపోయింది. 1988లో ఎస్వీ రంగారావు కోడలు ఒక ప్రమాదంతో కన్నుమూశారు సరిగా ఏడాదికి ఎస్వీ రంగారావు చనిపోయిన అదే డేట్ తర్వార సంవత్సరం రంగారావు కొడుకు కూడా కన్నుమూశారు తండ్రి చనిపోయిన అదే రోజు అదే విధంగా గుండెపోటుతో కన్నుమూశారు.

Advertisement

Also read:

భర్త చనిపోయిన దుఃఖాన్ని దిగమింగుకొని ఎదో అలా నడిపిస్తోంది. కానీ లీలావతి కొడుకు కోడలు కూడా మరణించడంతో తీవ్రత క్షోభ కి గురయ్యారు. అయినా కూడా వారికి కలిగిన ఏకైక సంతానాన్ని ఆమె పెంచారు. ఎస్వి రంగారావు చనిపోయాక 26 ఏళ్లకి లీలావతి కూడా చనిపోయారు అప్పటిదాకా మనవడిని పెంచారు ఇద్దరు కూతుర్లు కి పెళ్లి చేశారు. ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి. ఎస్వీ రంగారావు మనవడికి నా అనే వాళ్ళు లేకపోయారు బంధువుల సహాయంతో జీవితంలో బానే సెటిల్ అయ్యారు ప్రస్తుతం పరిస్థితి బానే ఉంది కానీ లీలావతి మాత్రం అతన్ని పెంచడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కోట్లలో ఉండే ఆస్తి అంతా కూడా మెల్లమెల్లగా కరిగిపోయింది.

Also read:

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading