బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ బ్యూటీ సినిమాల కంటే వ్యక్తిగత కారణాలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ఆమె ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసింది. గత ఏడాది ఆమె వ్యాపారవేత్త లలిత్ మోడీతో ప్రేమాయణం సాగించింది. కొన్ని నెలల తర్వాత అతనితో విడిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న సుస్మితా సేన్.. ఇప్పుడు మళ్లీ డేటింగ్ ప్రారంభించింది. ఆశ్చర్యం ఏంటంటే.. ఈసారి ఆమె జీవితంలోకి వచ్చిన కొత్త అబ్బాయి ఎవరో కాదండోయ్.. ఆమె మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో మరోసారి డేటింగ్ చేస్తోంది. వారు బహిరంగంగా కలిసి కనిపించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Advertisement
సుస్మితా సేన్, రోహ్మాన్ షాల్ మధ్య ఉన్న సంబంధం గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే వారిద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. సుస్మితా సేన్ వయసు ఇప్పుడు 47 ఏళ్లు. ఆమె బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాల్ వయసు 32 ఏళ్లు. సుస్మిత కంటే రోహ్మాన్ 15 ఏళ్లు చిన్నవాడు. ఈ జంట మధ్య ప్రేమ చిగురించడంతో అందరూ షాక్‌కు గురైన మాట వాస్తవమే. రోహ్మన్ షాల్, సుస్మితా సేన్ 2018లో మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత డేటింగ్ మొదలుపెట్టారు. మూడేళ్లుగా వారిద్దరి మధ్య అంతా బాగానే ఉంది. అయితే అది 2021లో ఏం జరిగిందో తెలియదు. అకస్మాత్తుగా అదే ఏడాది డిసెంబర్లో వారిద్దరూ విడిపోయారు.
ఇక ఆ తర్వాత సుస్మితా సేన్ జీవితంలోకి లలిత్ మోడీ ప్రవేశించారు. అయితే ఆ సంబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇటీవల సెలబ్రిటీల దీపావళి పార్టీ జరిగింది. ఈ విందులో పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొంటున్నారు. సుస్మితా సేన్, రోహ్మన్ షాల్ చేతులు పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు ఆనందంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దాంతో నెటిజన్స్ ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. లలిత్ మోదీ ఎక్కడ? అతని కథ ఏమైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటన్నింటికీ సుస్మితా సేన్ ఎప్పుడు సమాధానం చెబుతుందో వేచి చూడాలి.