Home » సూర్య “కంగువ” విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

సూర్య “కంగువ” విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

by Anji
Ad

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంపౌండ్ నుంచి వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. శివ దర్శకత్వంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ గ్లింప్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా షూటింగ్‌తో పాటు విడుదలపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది.  నిర్మాత ధనుంజయన్ ఓ ఇంటర్వ్యూలో సూర్య కంగువలో తన పోర్షన్‌ను నవంబర్‌ కల్లా పూర్తి చేయనున్నట్టు చెప్పారు.


అంతేకాదు.. సినిమాకు బడ్జెట్‌ అనుకున్న దాని కంటే ఎక్కువైందని చెప్పారు. షూటింగ్‌ పూర్తయిన దాన్ని బట్టి విడుదల తేదీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 2024 వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేశామన్నారు. మగధీర లైన్‌లో కంగువ ఉండబోతుందని చెప్పుకొచ్చారు. చెన్నై షెడ్యూల్‌లో వార్‌ సీక్వెన్స్‌ను షూట్‌ చేయబోతున్నారు. పాపులర్ నార్తిండియన్ యాక్టర్‌ ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నాడని.. టీజర్‌ జనవరి చివరికల్లా విడుదల కానుందని తెలియజేశారు. ఇప్పుడు ఈ  అప్‌డేట్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.

Advertisement

Advertisement

ఇప్పటికే కంగువ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న కంగువ థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ౩డీ ఫార్మాట్‌లో కూడా సందడి చేయనుంది. ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం అందిస్తున్నాడు.
అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. గతానికి, ప్రస్తుత కాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. కంగువలో సూర్య వారియర్‌గా నయా అవతార్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వారియర్‌.. లీడర్‌.. కింగ్‌.. సూర్య రాజసం ఉట్టిపడేలా గుర్రంపై వస్తున్న వారియర్ లుక్‌తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు సూర్య.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !   తెలుగు న్యూస్  కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading