Home » Suryakumar Yadav : ICC మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360

Suryakumar Yadav : ICC మెన్స్‌ టీ20 లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మిస్టర్‌ 360

by Bunty
Ad

భారత క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో అతని మెరుపు ఇన్నింగ్స్ తో స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు. అయితే, సూర్య కుమార్ యాదవ్ తాజాగా అరుదైన అవార్డును సొంతం చేసుకున్నాడు. ఐసిసి పురుషుల టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ మిస్టర్ ప్లేయర్ ను ప్రతిష్టాత్మక అవార్డును ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

Advertisement

ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలు విడుదల చేసింది. గతేడాది 31 టీ20 మ్యాచ్ లు ఆడిన సూర్య కుమార్ యాదవ్ 46.56 సగటు, 187.43 స్ట్రైక్ రేట్ తో 1164 పరుగులు చేశాడు. ఇందులో రెండు, తొమ్మిది ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ క్యాలెండర్ ఇయర్ లో 1000 ప్లస్ టి20 రన్స్ చేసిన రెండో బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. గతేడాది మొత్తం 68 సిక్సులు బాదిన సూర్య, ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సులు బాదిన ప్లేయర్ గా నిలిచాడు.

Advertisement

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచ కప్ లో సూర్య 6 ఇన్నింగ్స్ లో మూడు హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లో సెంచరీ బాదిన సూర్య, 890 రేటింగ్ పాయింట్స్ టి20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంతకు ముందు ఇంగ్లాండ్ తో 55 బంతుల్లో 117 పరుగులతో తొలి శతకం బాదాడు. టీ20 లో సత్తా చాటిన సూర్య కుమార్ యాదవ్ వన్డే క్రికెట్లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోతున్నాడు. శ్రీలంకతో చివరి వన్డే తో పాటు న్యూజిలాండ్ తో 3 వన్డేల సిరీస్ లోను విఫలమయ్యాడు.

read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

Visitors Are Also Reading