Home » డివిలియర్స్ తర్వాత ఆ స్థానం సూర్య కుమార్ కే సొంతం…!

డివిలియర్స్ తర్వాత ఆ స్థానం సూర్య కుమార్ కే సొంతం…!

by Azhar
Ad

ప్రపంచ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం అందరికి తెలుసు. క్రికెట్ ప్రపంచం మిస్టర్ 360 గా డివిలియర్స్ పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఆ పేరు రావడానికి కారణం గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్స్ అనే సమర్ధం ఉండటం. డివిలియర్స్ క్రీజులోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ లో 360 డిగ్రీలలో షాట్స్ ఆడుతాడు. ఇది అందరికి సాధ్యం కాదు. అయితే కారణాలు ఏవైనా కానీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్ నుండి చాలా త్వరగా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ నుండి కూడా త ఏడాది తప్పుకున్నాడు. దాంతో అతని స్థానం ఖాళీ అయిపోయింది.

Advertisement

కానీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడనికి భారత స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ వచ్చేసాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సూర్యకుమార్ నిన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన తీరు అందరిని ఆకట్టుకుంది. గ్రౌండ్ కు అన్ని వైపులా షాట్స్ ను ఆడాడు సూర్యకుమార్. అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. దాంతో క్రికెట్ లో నయా 360 వచ్చాడు అని.. అది సూర్యకుమార్ యాదవ్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. సూర్యకుమార్ ఆడిన అన్ని రకాల షాట్స్ యొక్క ఫోటోలను కలిపి ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

 

ఇక సూర్యకుమార్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్ నే కాకుండా.. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ను కూడా మెప్పించింది. సూర్యకుమార్ బ్యాటింగ్ పై సోషల్ మీడియా వేదిక సచిన్ స్పందిస్తూ.. సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా సెంచరీ చేసాడు. నిజంగా.. అతను కొన్ని అద్భుతమైన షోత అనేవి ఆడాడు. నేను ఇప్పటివరకు చూసిన గొప్ప బ్యాటింగ్ ఇన్నింగ్స్ లలో ఇది ఒకటి. ముఖ్యంగా సూర్యకుమార్… ఓవర్‌ పాయింట్‌లో కొట్టిన స్కూప్ సిక్సర్ అనేది మాత్రం… అద్భుతం అని సచిన్ పేర్కొన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో సూర్య సెంచరీ చేసిన టీం ఇండియా ఓడిపోయింది. సూర్యకు ఎవరు మద్దతుగా నిలవకపోవడంతో ఈ సిరీస్ లో భారత్ 2-1 తో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి :

మళ్ళీ రెస్ట్ కోరుతున్న కోహ్లీ.. బీసీసీఐ ఏం చేయనుంది..?

ప్రయివేట్ ఐపీఎల్ నే నడిపిస్తున్న గుజరాత్ మేధావులు… లక్షల్లో..?

Visitors Are Also Reading