Home » మ్యాచ్ ఆడాలని లేదు.. అయితేనే ఇలా కొట్టవా..?

మ్యాచ్ ఆడాలని లేదు.. అయితేనే ఇలా కొట్టవా..?

by Azhar
Ad

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ 2022 కోసం సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో సూపర్ 16 ప్రారంభం కాగా.. ఇండియాకు మొదటి మ్యాచ్ సూపర్ 12 లో భాగంగా ఈ నెల 23న పాకిస్థాన్ తో ఉంది. ఇక ఈ మ్యాచ్ కంటే ముందు ఇండియా వార్మప్ మ్యాచ్ లు ఆడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఐసీసీ అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వార్మప్ మ్యాచ్ లో భాగంగా ఇండియా ఈరోజు ఆస్ట్రేలియాతో తలపడింది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియా అయారు పరుగులతో విజయం సాధించింది. అయితే ఇందులో అర్ధ శతకంతో మెరిసిన భారత బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కు సంబంధించిన ఓ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఈ మ్యాచ్ మ్యాచ్ లో సూర్య.. మరో బ్యాటర్ అయిన అక్షర్ పటేల్ తో.. నాకు ఈ మ్యాచ్ ఆడాలి అనిపించడం లేదు అని చెప్పాడు.

Advertisement

ఇక సూర్య మాటలు అన్ని అక్కడ స్టాంప్ మైక్ లో రికార్డు అయ్యి.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సూర్య కుమార్ కు ఆడాలి అనిపించని మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేస్తే.. ఇక ఆడాలి అనుకునే మ్యాచ్ లో సెంచరీలే అని అంటున్నారు. అందువల్ల మొదటి మ్యాచ్ లో పాక్ పై సూర్య చెలరేగుతాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ లో ఈ రన్ ఔట్ జరుగుతుందా..?

ఇండియా ప్రపంచ కప్ గెలవదను గంభీర్.. ప్లీజ్..!

Visitors Are Also Reading