వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత పది రోజుల కిందట టీమిండియా జట్టును బీసీసీఐ పాలకమండలి ప్రకటించేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ వరల్డ్ కప్ టీం లో… సంజూ శాంసన్ మాత్రం లేడు. అటు వన్డేలలో విఫలమవుతున్న సూర్య కుమార్ యాదవ్ కు మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 లో చోటు దక్కింది.
సంజు శాంసన్ ను కాదని సూర్య కుమార్ యాదవ్ ను వరల్డ్ కప్ జట్టులో సెలెక్ట్ చేయడంపై ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టి20 లు తప్ప వన్డేలు ఆడరాని సూర్యకుమార్ యాదవ్ ను ఎందుకు సెలెక్ట్ చేశారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ప్లేయర్లలో సూర్యకుమార్ యాదవ్ గ్రేట్ బ్యాటర్ కొనియాడాడు. టి20 లలో సూర్య కుమార్ యాదవ్ బీభత్సం గా ఆడతాడు… కానీ వన్డేలలో అతడు విఫలమైంది వాస్తవమని తెలిపాడు హెడ్ కోచ్ ద్రావిడ్.
Advertisement
Advertisement
కానీ త్వరలోనే పుంజుకొని ఆడతాడు.. సూర్య కుమార్ యాదవ్ పై పూర్తి నమ్మకం మాకుంది అంటూ రాహుల్ ద్రావిడు చెప్పుకొచ్చాడు. ఆరో నెంబర్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించాడు. ఎవరిని చెప్పినా వన్డే వరల్డ్ కప్ జట్టులో… సూర్య కుమార్ యాదవ్ ఉంటాడని కుండబద్దలు కొట్టి చెప్పారు రాహుల్ ద్రావిడ్. ఇక రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలతో… సంజు శాంసన్ ను మర్చిపోవాల్సిందేనని… అతడు టీమిండియాలోకి రావడం ఇక కష్టమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ విజేతకు రూ. 33 కోట్లు..ఆ ట్రోఫీ ధర ఎంతో తెలుసా..?
- యాంకర్ ఝాన్సీ భర్త రెండో పెళ్లి ..అసలు కారణం ఏంటీ?
- బాలకృష్ణ ఇద్దరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశాడు…కానీ YSR కాపాడారు – పోసాని సంచలనం