Home » తన అభిమానిని తలుచుకొని బాధపడ్డ సూర్య.. ఎందుకంటే ?

తన అభిమానిని తలుచుకొని బాధపడ్డ సూర్య.. ఎందుకంటే ?

by Anji
Ad

హీరో సూర్యకు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా భారీగానే  అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల అవుతూ ఉంటాయి. ఇక తెలుగు అభిమానులు అంటే సూర్యకు చాలా ఇష్టమట. ఇటీవల ఆయన  ఓ అభిమానిని కోల్పోయారు. ఆమెకు నివాళిని ఘటించారు సూర్య. తన అభిమాని చనిపోయింది అనే  విషయం తెలుసుకున్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

Advertisement

 ఆ అమ్మాయి మరెవరో కాదండోయ్..  ఇటీవల టెక్సాస్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగు అమ్మాయి తాటికొండ ఐశ్వర్య. మే 7న మధ్యాహ్నం టెక్సాస్ లోని ఓ షాపింగ్ మాల్ లోకి ఓ దుండగుడు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఏడుగురు మృతి చెందారు. ఆ అమ్మాయి తనకు పెద్ద ఫ్యాన్ అని సూర్య తెలుసుకుని ఆమె కుటుంబానికి ఓలేఖను కూడా పంపారు సూర్య.

Advertisement

అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఓ లేఖను రాశారు. “ఐశ్వర్య లేని లోటును తీర్చడం చాలా కష్టం. ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చడానికి నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి మనకు తీరని లోటు. ఆమె ఎప్పటికీ తన జ్ఞాపకాల్లో బతికే ఉంటుందని ఐశ్వర్య తల్లిదండ్రులను ఓదార్చాడు సూర్య. ఐశ్వర్య నువ్వు నిజమైన హీరోవి. నువ్వు చిందించే నవ్వు.. ప్రేమను పంచే నీ గుణం.. ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందని తెలిపారు. ఇది తాను ఆమెకు ఇస్తున్న నివాళి కాదని.. ఆమె పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతున్నాను ” అని పేర్కొన్నారు సూర్య.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పోకిరి మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరో మీకు తెలుసా ?

ఆరుగురు ఎంపీలు కలిసి పని చేసిన సినిమా ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading