Home » సూర్య కూతురుకు టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వ‌చ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సూర్య కూతురుకు టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వ‌చ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

త‌మిళ‌నాడు ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు ఇటీవ‌లే విడుద‌ల అయ్యాయి. అయితే ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూతురుకు సంబంధించిన టెన్త్ క్లాస్ మార్కులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

సౌత్ స్టార్ హీరో సూర్య గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న‌దైన స్టైల్‌లో ఆయ‌న సినిమాలు చేస్తూ అభిమానుల‌ను ఆక‌ర్షిస్తుంటాడు. కోలీవుడ్‌లో నెంబ‌ర్ వ‌న్ స్టార్ హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో కూడా సూర్య‌కు అభిమానులు చాలా మందే ఉన్నారు. సూర్య హీరోయిన్ జ్యోతిక‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సూర్య త‌న‌తో పాటు కాక కాక‌, మాయావి లాంటి సినిమాల్లో న‌టించిన జ్యోతికను ప్రేమించాడు. ఆ త‌రువాత 2006లో వీరిద్ద‌రూ వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌లు. ఒక కూతురు, ఒక కుమారుడు క‌ల‌రు. కూతురు పేరు దియా, కొడుకు పేరు దేవ్‌.

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే సూర్య‌ను పెళ్లి చేసుకుని జ్యోతిక సినిమాల‌కు గుడ్ బై చెప్పిన జ్యోతిక త‌మ పిల్ల‌లు దియా, దేవ్ ఆల‌నా, పాల‌నా చూసుకుంటుంది. సూర్య‌కు త‌న పిల్ల‌లంటే ఎన‌లేని ప్రేమ‌. ముఖ్యంగా దియాతో సూర్య‌కు ఉన్న అనుబంధం మాటల్లో వ‌ర్ణించ‌లేనిది. కొద్దిగా స‌మ‌యం దొరికినా సూర్య కూతురు, కొడుకుతో క‌లిసి చిన్న‌పిల్లాడు అయిపోతాడు. ఫ్యామిలీతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు సూర్య‌. ఇక సూర్య కూతురు దియా చెన్నైలోని ఓ ప్ర‌యివేటు పాఠ‌శాల‌లో 10వ త‌ర‌గ‌తి పూర్తి చేసింది. ఆమె టెన్త్ ప‌రీక్ష ఫ‌లితాలు ఇటీవ‌లే విడుద‌ల‌య్యాయి. చిన్న‌ప్ప‌టి నుంచి ఫ‌స్ట్ క్లాస్ స్టూడెంట్. 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాల్లో దియా మార్కులు చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు.

Advertisement


ఇక సూర్య గారాల ప‌ట్టి అన్ని స‌బ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు సంపాదించింది. ఇక మ్యాథ‌మెటిక్స్ లో అయితే 100కు 100 మార్కులు రావ‌డంతో ఇది చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు. అన్ని స‌బ్జెక్టుల్లోనూ 95 ప్ల‌స్ మార్కులు సంపాదించింది దియా. ఇంగ్లీషులో 99, సైన్స్‌లో 98, త‌మిళ్‌95, సోష‌ల్ 95 మార్కులు వ‌చ్చాయి. క‌ష్టంగా ఉండే మ్యాథ‌మేటిక్స్‌లో 100 శాతం మార్కులు సంపాదించిందంటే దియా ఎంత క‌ష్ట‌ప‌డింతో అర్థం చేసుకోవ‌చ్చు. కూతురు సాధించిన బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌కు సూర్య పొంగిపోతున్నారు. వారి కుటుంబం మొత్తం సంబ‌రాలు చేసుకుంటుంది. ఈ విష‌యం తెలిసిన అభిమానులు సైతం సూర్య దంప‌తులకు, దియాకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

Also Read : 

ల‌క్ష‌ల్లో బిల్లు చేసిన పూజా హెగ్దే.. చెల్లించ‌మ‌న్న నిర్మాత‌లు..!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌స్తున్న రూమ‌ర్స్‌పై స్పందించిన న‌రేష్‌..!

 

Visitors Are Also Reading