ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాకు ఊరట లభించనున్నది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్‌రాయ్ దూరం అయ్యాడు. అతన్ని వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు అతడు దూరం కావడంతో మరొక ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉన్నది. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టుకు క్రికెట్ విశ్లేషకులు ఓ సలహా ఇస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న సురేష్ రైనాను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
ఐపీఎల్ చరిత్రలోనే రైనా అతి ముఖ్యమైన ఆటగాడు అని, అతని రికార్డులు చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది అని పలువురు విశ్లేషిస్తున్నారు. రైనాను జట్టులోకి తీసుకుంటే యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా కూడా పని కొస్తాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన రైనా 5525 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 32.54 సగటుతో పాటు 135 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత త్వరలోనే రైనాను తీసుకునే విషయంపై ఆ జట్టు అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
Also Read : టీ-20 ర్యాకింగ్స్ టాప్ 20లోకి శ్రేయాస్ అయ్యర్