ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా ఈ జులై 14న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ ట్రైలర్ విడుదలై అందులోని పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ డీ గ్లామరస్ రోల్లో కనిపించబోతుందట. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను చూసినవారు నలుపు, తెలుపు శరీర రంగును ఉద్దేశించేలా తెరకెక్కిన ‘బేబీ’ లాంటి సినిమాలను ప్రత్యేకంగా చూడాలా అంటూ పలు విమర్శలు కూడా చేస్తున్నారు. దీనితో హీరో ఆనంద్ కూడా స్పందించి.. సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందామన్నాడు. అంతలా ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో అనేక విమర్శలను ఎదుర్కొంటుంది.
Advertisement
ఇక తాజాగా ఈ చిత్ర యూనిట్‌తో ఓ ఇంటర్వ్యూ పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఒక రిపోర్టర్ బేబీ సినిమా హీరోయిన్‌తో.. వైష్ణవిని ముద్దు పెట్టుకుంటా అంటూ కొంచెం తేడాగా అడగటం జరిగింది. ఆ రిపోర్టర్ మాట విన్నా వైష్ణవికి ఏమనాలో తెలియక కొద్దిసేపు షాక్ లో అలాగే ఉండిపోతుంది. వెంటనే ఆ రిపోర్టర్ కలుగచేసుకుని అంటే.. ఈ సినిమాలో హీరో అడిగిన ప్రశ్న ఇదే కదా.. అంటే ఈ సినిమాలో హీరో మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటా అన్నాడు కదా అని టాపిక్ డైవర్ట్ చేస్తూ.. దానికి మీ రియాక్షన్ ఏంటని తనదైన స్టైల్‌లో ప్రశ్నను మార్చేస్తాడు.
Advertisement
దానికి గాను వైష్ణవి కూడా తెలివిగా ఓహ్… టీజర్‌లో ఉన్న సీన్ గురించా అంటూ.. చెప్పు తెగుద్ది అంటాను అంటూ సరైన జవాబు ఇచ్చింది.. ఇక వైష్ణవి ఇచ్చిన జవాబు రిపోర్టర్ కి బాగా అర్థమైనట్లుంది. ఓహో.. చెప్పు తెగుద్దా అంటూ టాపిక్ ని వేరే విధంగా పక్కకు మళ్ళించే ప్రయత్నం చేసాడు. ఇంతకీ ఆ రిపోర్టర్ మరెవరో కాదు.. సంతోషం సినీ వారపత్రికను స్థాపించి.. దాన్ని విజయవంతంగా నడపడమే కాకుండా.. సంతోషం సినిమా అవార్డులు ఇచ్చే సురేష్ కొండేటి.
ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్లలో సురేష్ కొండేటి అడుగుతున్న ప్రశ్నలు ట్రోలింగ్‌కు కారణమవుతున్నాయి. ఇంటర్వ్యూల పేరుతో హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడడం, సినిమా దర్శకులను చులకన చేయడం, ఇలాంటి సినిమాలు తెలుగోళ్లు తీయలేరా అని ఆయన కూడా ఒక తెలుగోడని మరిచిపోయి చులకన చేసుకోవడం వంటివి అందరినీ ఆగ్రహం గురి చేస్తున్నాయి. ఇలాంటి కామెంట్లు చేయడం బహుశా సినిమా ప్రమోషన్స్ కోసమా..ఆ లేక ఆయన వ్యక్తిగతంగా అలా మాట్లాడుతున్నారా.. అనే విషయం ఆయనకే తెలియాలి అంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఈసారి సితార గట్టిగానే ప్లాన్ చేసిందిగా.. నెక్ట్స్ ఏం చేయబోతుందంటే..?
Sourav Ganguly : తిరుపతిలో రహస్యంగా పెళ్లిచేసుకున్న గంగూలీ – నగ్మా!