టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు గురించి తెలియని వారుండరు. రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఆయన ఇంకా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు కూడా హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మన అందరికీ తెలిసిందే. సురేష్ బాబు 1990లో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమాతో నిర్మాతగా మారారు.
Advertisement
మొదట ఏడు సినిమాలు వెంకటేష్ హీరోగా తీసిన సురేష్ బాబు ఉదయ్ కిరణ్ తో నీకు నేను నాకు నువ్వు చిత్రం నిర్మించారు. ఆ తర్వాత మల్లీశ్వరి, తులసి, మసాలా, దృశ్యం, దృశ్యం2, నారప్ప, వెంకీ మామ, గోపాల గోపాల వంటి సినిమాలు వెంకటేష్ తో తీశాడు. ఇది ఇలా ఉండగా, హైదరాబాదులో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతిరోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.
Advertisement
అయితే, తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అటువైపు వెళుతున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రణలోకి తీసుకొచ్చాడు. సాక్షాత్తు ఒక సినీ ప్రముఖుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుండటం వాహనదారులను ఆకట్టుకుంది. ఈ సన్నివేశాన్ని వారు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు సురేష్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు.
READ ALSO : సమంతకు అమ్మను అవుతా…దేవుడిలా రక్షిస్తా- రష్మిక