Home » Surekha Vani : మరోసారి కూతురితో రచ్చ చేసిన సురేఖావాణి

Surekha Vani : మరోసారి కూతురితో రచ్చ చేసిన సురేఖావాణి

by Bunty
Ad

టాలీవుడ్ యాక్టర్ సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె సోషల్ మీడియాలో తన కూతురితో కలిసి చేసే వీడియోలు నెట్టింట్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో సురేఖ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాకుండా తన కూతురిని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప యాక్టర్ గా చూడాలని సుప్రీత అనుకుంటున్నారు. తన కూతురితో కలిసి సురేఖ ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా సుప్రీత కూడా తన తల్లితో కలిసి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. దీంతో చాలామంది తల్లి, కూతుర్లపై నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.

Surekha Vani Daughter Supritha REACTS To Trolling

 

కానీ వారు ఆ కామెంట్లను పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఇక వారు అలా సైలెంట్ గా ఉండడంతో ఈ మధ్య వారిపై మరి దారుణంగా కామెంట్లు పెడుతున్నారట. దీంతో ఈ కామెంట్లపై సుప్రీత స్పందించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీత తన తల్లి ఇద్దరు రేవంత్ ని అభినందించారు. గతంలో వీరిద్దరూ కలిసి రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వారిపై పలువురు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం గతంలో సుప్రీత, సురేఖ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

ఇక బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆ వీడియోలను వీరు డిలీట్ చేశారు. రేవంత్ తో దిగిన ఫోటోను సురేఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సురేఖపై చాలా దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. దీంతో సుప్రీత మాట్లాడుతూ…. రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరి వేధిస్తున్నారు. నేను మొదటగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వారికి శుభాకాంక్షలు చెబుతున్నాను. ఇంత మాత్రానికే నన్ను ఇంత దారుణంగా ట్రోలింగ్ చేయాలా? నేను మీకు ఏ అన్యాయం చేశాను? నా మీద ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు ఇలా చేయడం వల్ల నేను మానసికంగా బాధపడుతున్నాను అని సుప్రీత రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading