ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్ట్ ల హవా కనిపిస్తోంది. సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ లకు కూడా ముఖ్యమైన పాత్రలు లభిస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ ల చుట్టే తిరగటం విశేషం. అంతే కాకుండా క్యూట్ గా మాట్లాడుతూ నటనతో ఆకట్టుకోవాలే కానీ వారికి కూడా అభిమానులు ఉంటారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సుప్రీమ్ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు.
ALSO READ :అప్పుడు ఆరోగ్యం క్షీణించింది…ఆరోగ్యపరిస్థితి పై సమంత కామెంట్స్.!
కాగా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మైకేల్ గాంధీ…సుప్రీమ్ లో నటిస్తున్న సమయంలో మైకేల్ వయసు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. అంతేకాకుండా ఆ తరవాత అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాలో కూడా మైకేల్ చిన్ననాటి అఖిల్ పాత్రలో నటించి అదరగొట్టారు. మైకేల్ గాంధీ తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తుంటాడు.
ముఖ్యంగా మైకేల్ గాంధీ కెరీర్ ప్రారంభంలో పాకిస్థాన్ మరియు శ్రీలకకు సంబంధించిన పలు టీవీ యాడ్ లలో నటించారు. కాగా మొదటి సారి మైకేల్ తో నే నటుడు గా పరిచయ అయ్యాడు. అంతే కాకుండా సచిన్ టెండూల్కర్ బయోపిక్ లో చిన్ననాటి సచిన్ గా కూడా మైకేల్ నటించి అలరించాడు. అయితే సచిన్ టెండూల్కర్ బయోపిక్ కోసం వెయ్యి మందిని ఆడిషన్స్ చేస్తే అందులో మైకేల్ ను ఎంపిక చేశారు. ఇక ప్రస్తుతం మైకేల్ గాంధీ చాలా మారిపోయాడు. అంతే కాకుండా ప్రస్తుతం ఈ బుడ్డోడు సినిమాలు మరియు టీవీ యాడ్ లలో నటిస్తున్నాడు.