సూపర్ స్టార్ కృష్ణకు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోవడంతో డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయినా ప్రభావం తగ్గకపోవడంతో హార్ట్ ఎటాక్ వల్ల ఊపిరితిత్తులు, కిడ్నీలపై ఎఫెక్ట్ పడడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో డాక్టర్లు కృష్ణ ఆరోగ్యం క్రిటికల్ గానే ఉందని చెబుతూనే ఉన్నారు.
ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ పై బులిటెన్ విడుదల చేస్తూనే ఉన్నారు. డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ప్రాణాలను మాత్రం కాపాడలేక పోయారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు కృష్ణ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
1964 లో తేనె మనసులు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కృష్ణ. అలా మెల్లిమెల్లిగా ఇండస్ట్రీ లోనే సూపర్ స్టార్ గా మారారు. 79 ఏండ్ల సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి ప్రత్యేక గుర్తింపు సాధించారని చెప్పవచ్చు. ప్రస్తుతం కృష్ణ మరణంతో ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని, కృష్ణ కుటుంబ సభ్యులకు తీరని లోటని చెప్పవచ్చు.
also read:మగధీరలో కాజల్ కన్నా ముందు ఆ హీరోయిన్ అనుకున్నారట..కానీ చిన్న రీజన్ తో రిజెక్ట్..!!