Home » మహేష్ బాబు వల్లే ఎంపీనయ్యా.. మల్లారెడ్డి మాటలకు ఆశ్చర్యపోయిన సూపర్ స్టార్..!

మహేష్ బాబు వల్లే ఎంపీనయ్యా.. మల్లారెడ్డి మాటలకు ఆశ్చర్యపోయిన సూపర్ స్టార్..!

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ  దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి.. సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  ఆ ఒక్క సినిమాతోనే అయన ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి కబీర్ సింగ్ అనే సినిమా చేశారు. ఇప్పుడు యానిమల్ మూవీతో మళ్ళీ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డులను మొత్తం బ్రేక్ చేసేందుకు డిసెంబర్ 01న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.   ఈ  నేపథ్యంలోనే   మల్లారెడ్డి యూనివర్సిటీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.


ఇక ఈ క్రమంలోనే చీఫ్ గెస్టులుగా రాజమౌళి, మహేష్ బాబు లాంటి స్టార్లు ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇక అందరికంటే మంత్రి మల్లారెడ్డి రావడం ఆయన మాట్లాడడం అందరిని ఆకర్షించింది. స్టేజ్ పైకి ఎక్కి అనిమల్ సినిమాకి బెస్ట్ విషెస్ చెప్తూనే.. మహేష్ బాబు గురించి మహేష్ బాబు తీసిన బిజినెస్ మాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను బిజినెస్ మాన్ సినిమా చూసే పాలిటిక్స్ లోకి వచ్చాను. బిజినెస్ మాన్ సినిమా చూసే నేను మంత్రిగా మారాను అంటూ చెబుతుండగా మహేష్ బాబు మాత్రం మల్లారెడ్డి మాటలకు నవ్వుకున్నాడు. ఇక ఈ విధంగా సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో కూడా సినిమాలు తీసి నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అంటూ అలాగే రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ లో సినిమాలో చేస్తున్నాడు.

Advertisement

Advertisement


వీళ్లంతా టాప్ డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ లోకి తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న డైరెక్టర్లు అంటూ తను ఇచ్చిన స్పీచ్ కి అక్కడున్న వాళ్లు అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఇక ఇప్పటికే మల్లారెడ్డి ఎలక్షన్స్ లో బిజీగా ఉన్న కూడా అనిమల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పొలిటీషియన్ గా మల్లారెడ్డి విషయం పక్కన పెడితే ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ విపరీతంగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ ఫంక్షన్ ప్రతి ఒక్కరు తమదైన బెస్ట్ విషెస్ ని చెబుతూ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

 

Visitors Are Also Reading