నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినీరంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇక ఆయన సినీ కెరీర్ లోనే దానవీరశూరకర్ణ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లోనే కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఎన్టీఆర్ ఇమేజ్ నీ మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఇందులో ఎన్టీఆర్ గెటప్, డైలాగ్స్ సన్నివేశాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. దానవీరశూరకర్ణ సినిమాకు ఎన్టీఆర్ అన్ని స్వయంగా తానే వ్యవహరించారు. ముఖ్యంగా దర్శకత్వం వహించడంతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు వంటి మూడు పాత్రల్లో నటించాడు ఎన్టీఆర్. దాదాపు 226 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఆ రోజుల్లోనే 10 లక్షల బడ్జెట్ తో నిర్మించారు.
Advertisement
అప్పట్లోనే దాదాపు ఒకటిన్నర కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు నిర్మాత కూడా ఎన్టీఆర్ కావడం విశేషం. మూడు గంటలకు పైగా నిడివి కలిగిన ఈ సినిమాకు రెండు ఇంటర్వెల్స్ వేసేవారట. ప్రేక్షకులు అయినా విసుగు చెందకుండా ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా చూశారట. 1994లో రీ రిలీజ్ చేయగా మళ్లీ భారీ వసూలు సాధించడం విశేషం. దానవీరశూరకర్ణ చిత్రానికి సూపర్ స్టార్ కృష్ణ ఎదురెళ్లి మరి నష్టపోయారు. ఓవైపు ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ చిత్రం చేస్తుంటే మరోవైపు మహాభారతం సబ్జెక్టుతో కురుక్షేత్రం టైటిల్ తో ఓ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. ఇందులో కృష్ణ అర్జునుడిగా, శోభన్ బాబు కృష్ణుడిగా, కృష్ణంరాజు కర్ణుడిగా పాత్రలు చేశారు. ఎన్టీఆర్ తో ఢీ అంటే ఢీ అంటూ కురుక్షేత్రం చిత్రం కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగింది.
Advertisement
1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం సినిమాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య ఎంతో ఉత్కంఠ నెలకొంది. దానవీరశూరకర్ణ మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించింది. కురుక్షేత్రం మూవీ మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ ముందు కృష్ణ నిలబడలేకపోయారు. అల్లూరి సీతారామరాజు మూవీ చేసిన కృష్ణ ఆ సమయంలో వీరిద్దరి మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ వివాదం నేపథ్యంలో కోల్డ్ వార్ నడిచింది. ఎన్టీఆర్ లోపాలు ఎత్తిచూపుతూ కృష్ణ పలు సినిమాలను చేశారు. ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణ ఆయన మీద సెటైరికల్ మూవీస్ చేశారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ దానవీరశూరకర్ణకు ఎదురు వెళ్లి కృష్ణ కురుక్షేత్రంతో నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ?
Srileela: ఈ సినిమా ఛాన్స్ కూడా శ్రీలీలకే వెళ్లిందా? ఒకవేళ శ్రీలీల మిస్ చేసుకోకుండా ఉండుంటే?